అన్వేషించండి

KA Movie Sequel: కిరణ్ అబ్బవరం సినిమాకు సీక్వెల్ కన్ఫర్మ్... 'క 2'కు టైటిల్ కూడా ఫిక్స్!

KA 2 Movie: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'క' దీపావళికి థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీయడానికి కిరణ్ అబ్బవరం రెడీ అవుతున్నారు. ఆ సినిమా టైటిల్ ఏంటో తెలుసా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కష్టానికి తగ్గ ఫలితం లభించింది. విమర్శకుల నుంచి 'క' (KA Movie) చిత్రానికి ప్రశంసలు వస్తున్నాయి. పెయిడ్ ప్రీమియర్స్ నుంచి పాజిటివ్‌ రివ్యూలతో పాటు సోషల్ మీడియాలో సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ విజయోత్సాహంలో సీక్వెల్ అతి త్వరలో సెట్స్ మేరకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. మరి, ఆ సెకండ్ పార్ట్ టైటిల్ ఏమిటో తెలుసా? 

'క' సీక్వెల్ టైటిల్ ఏమిటంటే??
KA 2 Movie: 'క' సీక్వెల్ గురించి చెప్పే ముందు... అసలు 'క' అంటే ఏమిటో అర్థం చెప్పాలి. 'క' అంటే అంతరాత్మ అని సినిమా పతాక సన్నివేశాలలో హీరో కిరణ్ అబ్బవరం పాత్రతో క్లారిటీ ఇచ్చారు. మరి, ఈ సినిమాలో అంతరాత్మ ప్రాముఖ్యం ఏమిటి? అంతరాత్మ ఏం చేసింది? అనేది తెలుసుకోవాలంటే దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన క సినిమా చూడక తప్పదు. 

KA Movie Sequel: 'క' చిత్రానికి సీక్వెల్ ఉంటుందని థియేటర్లలో అనౌన్స్ చేశారు. ఎండ్ కార్డ్స్ ముందు 'క' రెండో పార్ట్ గురించి తెలిపారు. ఆ సినిమా టైటిల్ ఏమిటో తెలుసా? 'క: ది సోల్' (KA The Soul). మొదటి పార్ట్ లో అంతరాత్మ ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేసింది. మరి రెండో పార్టులో ఆ అంతరాత్మ (సోల్) ఏం చేస్తుందో చూడాలి.

కిరణ్ అబ్బవరం హిట్ కొట్టినట్లే!
'క' ప్రీ రిలీజ్ వేడుకలు కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయ్యారు. తన తల్లి కూలి పనులు చేసి తమను చదివించిందని, ఒక దశ తర్వాత విదేశాలు వెళ్లి ఉద్యోగం చేసి తమను ఉన్నత స్థాయికి తీసుకు వచ్చిందని, ఎటువంటి నేపథ్యం లేకుండా సినిమాల్లోకి వచ్చిన తాను నాలుగేళ్లలో ఎనిమిది సినిమాలు చేశానని, తనలాంటి ఒక వ్యక్తి థియేటర్ వరకు సినిమాలను తీసుకురావడం పెద్ద సక్సెస్ అని చెప్పారు. తన మీద పట్ల రావడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి వాడు ఎదగడం తప్పా? తనతో ప్రాబ్లం ఏమిటి? అని సూటిగా ప్రశ్నించారు.

Also Read: మహేష్ ఇంట దీపావళి సందడి... పట్టు పరికిణీలో సితార పాపను చూశారా?


కిరణ్ అబ్బవరం ఆవేదన ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు. సినిమా సినిమాకు కష్టపడుతున్న అతడికి ఒక హిట్ పడితే చూడాలని కోరుకున్నారు. ఆ విజయం 'క' సినిమాతో లభించింది. రూల్స్ రంజన్, మీటర్ వంటి సినిమాలో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరచుగా... ఈ దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన 'క' మంచి పేరు తెచ్చుకుంది.

'క' పతాక సన్నివేశాలకు ప్రశంసలు
'క' సినిమా అంతా ఒక ఎత్తు బతక సన్నివేశాలు చివరి 15 నిమిషాలు మరొక ఎత్తు అని విమర్శకులతో పాటు ప్రేక్షకుల సైతం చెబుతున్నారు. 'క' సినిమాలో క్లైమాక్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో, ఆ మాటకు వస్తే తెలుగు సినిమాల్లో ఈ తరహా క్లైమాక్స్ ఇప్పటివరకు చూడలేదని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం కొత్త కథ చెప్పే ప్రయత్నం చేశారు. దానికి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ట్విస్టులతో కూడిన న్యూ ఏజ్ సినిమా తీశారని సోషల్ మీడియా అంతా హోరెత్తిపోతుంది. దీపావళి కనుక ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

Also Read: కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసిన సినిమా ఇదే... సారీ చెప్పిన ప్రొడ్యూసర్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎన్నికల ప్రచారంలో చెత్త ట్రక్ తోలిన ట్రంప్టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
Karnataka: కర్ణాటకలో ఫ్రీ బస్ స్కీమ్ ఎత్తేస్తున్నారా ? -ఇదిగో సిద్దరామయ్య క్లారిటీ
కర్ణాటకలో ఫ్రీ బస్ స్కీమ్ ఎత్తేస్తున్నారా ? -ఇదిగో సిద్దరామయ్య క్లారిటీ
Bagheera Review: బఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?
బఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?
Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు - వెలుగుల్లో స్టార్ యాక్ట్రెస్
అనసూయ దీపావళి సంబరాలు - వెలుగుల్లో స్టార్ యాక్ట్రెస్
Russia Google : రష్యాతో పెట్టుకుంటే అంతే - గూగుల్‌కు ప్రపంచంలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ జరిమానా !
రష్యాతో పెట్టుకుంటే అంతే - గూగుల్‌కు ప్రపంచంలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ జరిమానా !
Embed widget