KGF Chapter 2 Box Office Collection: బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల తుఫాన్, రెండో రోజుల్లో 'కెజియఫ్ 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
రెండో రోజూ బాక్సాఫీస్ దగ్గర 'కెజియఫ్ 2' సినిమా జోరు చూపించింది. రెండు రోజుల్లో 240 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

బాక్సాఫీస్ దగ్గర రాకీ భాయ్ జోరు మరి కొన్ని రోజులు తగ్గేలా కనిపించడం లేదు. యశ్ నటనకు, ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, రవి బస్రూర్ సంగీతానికి, భువన గౌడ ఛాయాగ్రహణానికి ప్రేక్షకులు ఫిదా అంటున్నారు. సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు.
రెండో రోజూ రెండో రోజూ బాక్సాఫీస్ దగ్గర 'కెజియఫ్ 2' సినిమా జోరు చూపించింది. రెండు రోజుల్లో 240 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. సినిమా విడుదలైన రోజున, ఇండియాలో రూ. 134.5 కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం వెల్లడించి సంగతి తెలిసిందే. రెండు రోజు రూ. 105.5 కోట్లు కలెక్ట్ చేసిందని నేడు వెల్లడించారు. నార్త్ ఇండియాలో ఈ సినిమాకి భారీ వసూళ్లు వస్తున్నాయి. దాంతో చిత్ర బృందం హ్యాపీగా ఉంది. తమిళనాడులో సైతం విజయ్ 'బీస్ట్' కంటే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన 'కె.జి.యఫ్ 2'లో శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఇందులో రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో నటించారు.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు






















