Kalki 2898 AD Collection Day 6: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘కల్కి 2898 ఏడీ’ జోరు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో తెలుసా?
బాక్సాఫీస్ దగ్గర ‘కల్కి’ జోరు తగ్గింది. 6వ రోజు ఈ మూవీ భారత్ లో కేవలం రూ. 27.85 కోట్లు వసూళు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు చేరువైంది.
![Kalki 2898 AD Collection Day 6: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘కల్కి 2898 ఏడీ’ జోరు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో తెలుసా? Kalki 2898 AD Box Office Collection Day 6 Worldwide Kalki 2898 AD Collection Day 6: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘కల్కి 2898 ఏడీ’ జోరు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/86e34074f7213bf99ca0938ac2e573cc1719987198119544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kalki 2898 AD Box Office Collection Day 6: దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 AD’ 5 రోజుల పాటు భారీగా వసూళ్లను సాధించింది. 6వ రోజు మాత్రం బాక్సాఫీస్ దగ్గర కాస్త వెనుకబడింది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 27.85 కోట్లు వసూలు చేసినట్లు సాక్ నిల్క్ వెల్లడించింది. ఆరవ రోజు కలెక్షన్లను పరిశీలిస్తే, తెలుగులో రూ. 11.2 కోట్లు, తమిళంలో రూ. 1.2 కోట్లు, హిందీలో రూ. 14 కోట్లు, కన్నడలో రూ. 0.25 కోట్లు, మలయాళంలో రూ. 1.2 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ రూ. 371 కోట్లకు చేరుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు చేరువైన ‘కల్కి 2898 AD’ కలెక్షన్లు
సాక్‌నిల్క్ ప్రకారం ‘కల్కి 2898 AD’ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 570 కోట్లను సాధించింది. యుకెలో ఈ చిత్రం ఇప్పటి వరకు 957,173 పౌండ్లు సాధించింది. అంటే భారత కరెన్సీలో రూ. 10.13 కోట్లకు పైగా వసూళు చేసింది. ఇక నార్త్ అమెరికాలో ఈ చిత్రం అత్యంత వేగంగా 12.5 మిలియన్ మార్క్ ను చేరుకున్న చిత్రంగా రికార్డు నెలకొల్పింది. అంటే భారత కరెన్సీలో 104. 40 కోట్లను అందుకుంది. జూన్ 27న ‘కల్కి 2898 AD’ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. తొలి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 191 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది.
కీలక పాత్రలు పోషించి దిగ్గజ నటులు
ఇక రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె హీరో, హీరోయిన్లుగా నటించగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. దర్శక ధీరుడు రాజమౌళి, ఆర్జీవీ, దుల్కర సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా సహా పలువురు నటీనటులు ఇతర పాత్రల్లో ఆకట్టుకున్నారు. వీళ్లు వెండితెరపై కనిపించగానే ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం
నాగ్ అశ్విన్ ‘కల్కి’ మూవీపై ప్రేక్షకుల నుంచి తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. సాధారణ ప్రేక్షకుల నుంచి మొదలుకొని సెలబ్రిటీలు కూడా ప్రశంసల జల్లు కురిపించారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమా అద్భుతం అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంటర్వెల్ కు ముందు సినిమా కాస్త నెమ్మదిగా, స్లోగా ఉన్నా, సెకెండాఫ్ చాలా బాగుంది అంటున్నారు. చివరి అరగంట మరో లెవల్ అంటూ అభినందిస్తున్నారు. హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా ఉందంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య ఫైట్ సీన్లు అదుర్స్ అంటున్నారు.
Read Also: ‘విరుపాక్ష’ స్థాయిలో వరుణ్ సందేశ్ థ్రిల్లర్ మూవీ ‘విరాజీ’ - టైటిల్ రిలీజ్ వీడియో చూశారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)