By: ABP Desam | Updated at : 10 Aug 2023 02:27 PM (IST)
జేడీ చక్రవర్తి(Image Credits: JD Chakarborty/Twitter)
JD Chakravarthy : డైరెక్టర్ తేజ, నటుడు జేడీ చక్రవర్తి.. వీరిద్దరూ రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినవారే. ఆయన శిష్యులే. అయినప్పటికీ ఇద్దరికీ అస్సలు పడదు. ఈ విషయాన్ని వాళ్లిద్దరే చాలాసార్లు బహిరంగా చెప్పారు. వాళ్లిద్దర్లో ఒక్కర్ని.. ఇంకొకరి గురించి అడిగినా.. కథలు కథలుగా చెప్తూంటారు. అయితే జేడీ చక్రవర్తి కూడా ఇటీవల తేజ గురించి కాస్త ఎక్కువే చెప్పారు. తేజ.. తన ప్రేమకు సహాయం చేశానని, పెళ్లి కూడా చేశానని చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పే అబద్దాల్లో ఇది కూడా ఒకటని జేడీ చక్రవర్తి అన్నారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మారుతి సుజుకి కారు తాను కొనుగోలు చేశానని.. ఆ కారును తేజ తన స్వార్థంతో ప్రేమించిన అమ్మాయిని తీసుకురావడానికి వాడుకున్నాడని జేడీ గతంలోనూ చెప్పారు.
తేజ పెళ్లి చేశానని ఎప్పుడూ చెప్పలేదని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు. అతను వేసిన ప్లాన్ నుంచి తప్పించుకుని వచ్చానని చెప్పాను తప్ప.. ఆయన పెళ్లి చేశాను, చేద్దామనుకున్నానని ఎప్పుడూ చెప్పలేదు.. అసలు తనకు ప్రమేయం లేదని తెలిపారు. తేజ చేసిన ఓ స్టుపిడ్ మిస్టేక్ ఏంటంటే.. 15, 20 ఏళ్ల కిందట సితార మ్యాగజైన్ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో అతనే చెప్పాడు. తన పెళ్లి చేశానని, తన ప్రేమని గెలిపించానని, నెల్లూరు వెళ్లాం అని. కానీ అదేదీ నిజం కాదు. తేజ అలా చెప్పడం చూసి.. నిజానికి చాలా జాలేసింది.. అరెరే.. పాపం అనుకున్నా. ఇంకేం చేస్తాం.. అనుకున్నా. అతను చెప్పినవి చాలా తక్కువ గుర్తుంటాయి. ఎందుకంటే తేజ చెప్పిన వాటిలో చాలా తక్కువ నిజాలుంటాయి. అది అతనికి గుర్తు లేదేమో. తేజ అలా చెప్పాడు అంటే ఆ టైంలో అతను ఏదైనా ప్రాబ్లెంలో ఉండి ఉండాలి లేదంటే.. మైండ్ దొబ్బైనా ఉండాలని అన్నారు. కానీ ఇప్పుడు ఎవరికైనా ఇంకా సందేహం ఉంటే ఆ ఇంటర్వ్యూను మళ్లీ చూడొచ్చు" అని జేడీ చక్రవర్తి చెప్పారు.
ఇదిలా ఉండగా జేడీ చక్రవర్తి ఇటీవలే 'దయా' సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో జేడీ సరసన ఈషా రెబ్బా నటించారు. ఆన్ లైన్ లో ఇటీవలే రిలీజైన ఈ సిరీస్.. ఆగస్టు 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘దయా’లో తాను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా కనిపిస్తానని, చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం తన పని అని జేడీ చక్రవర్తి తన పాత్రను గురించి రిలీజ్ కు ముందే వెల్లడించారు. ఆ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌కు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుందని, పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో ఉండదని, ఈ భయంలో ఉండగానే ఇంకో శవం దొరుకుతుందన్నారు. సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటనలు మలుపుతిప్పుతాయన్న ఆయన.. ఆ ఎమోషన్స్ అన్నీ ‘దయా’లో చూస్తారని చెప్పారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్ప్రైజ్ అదిరింది
Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
/body>