Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Jani Master: బెంగళూరు రేవ్ పార్టీ న్యూస్ ఉదయం నుంచి టాలీవుడ్‌ను షేక్ చేసింది. అందులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉన్నారని న్యూస్ వచ్చింది. దాన్ని ఆయన ఖండించారు.
Janasena Party Member and Choreographer Jani Master On Bengaluru Rave Party: ప్రముఖ కొరియోగ్రాఫర్, ఏపీలో ఎన్నికలకు ముందు జనసేన పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన జానీ మాస్టర్ పేరు బెంగళూరు రేవ్ పార్టీలో వినిపించింది. అందులో వాస్తవం లేదని, అవన్నీ ఒట్టి పుకార్లేనని ఆయన ఖండించారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు రైడ్ చేసి సోమవారం ఉదయం రేవ్ పార్టీని భగ్నం చేసిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు నటీనటులు, మోడల్స్ ఆ పార్టీలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని వార్తలు రావడంలో టాలీవుడ్ షేక్ అయ్యింది. హీరో శ్రీకాంత్ కూడా ఆ లిస్టులో ఉన్నారని ప్రచారం జరిగింది. దాన్ని ఆయన ఖండించారు. ఆ తర్వాత జానీ మాస్టర్ సైతం సదరు వార్తలను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు - జానీ మాస్టర్
హైదారాబాద్ సిటీలో తన వాళ్ల మధ్య తీరిక లేకుండా తన పనుల్లో తాను నిమగ్నం అయ్యి ఉన్నానని జానీ మాస్టర్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నేనెక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని (జనసేన కార్యకర్తలను), జనసేనాని (పవన్ కల్యాణ్)ని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు'' అని జానీ మాస్టర్ ఘాటుగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పిల్లలకు చాక్లెట్ పార్టీ ఇవ్వడానికే టైమ్ లేదు
పిల్లలకు సెలవులు వచ్చాయని, వాళ్లకు చాక్లెట్ పార్టీ ఇవ్వడానికి కూడా తనకు టైమ్ లేదని జానీ మాస్టర్ ఓ వీడియోలో పేర్కొన్నారు. రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. జూన్ 4 తర్వాత అందరికీ అసలైన పార్టీ అని జానీ మాస్టర్ పేర్కొన్నారు.
Also Read: పాయల్‌కు ఇవ్వాల్సింది 6 లక్షలే - నాన్ కోపరేషన్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్, ఆమె ఆరోపణల్ని ఖండించిన TFPC
జానీ మాస్టర్ మాట్లాడుతూ... '' నిన్న (ఆదివారం) డైరక్టర్స్ డే (దర్శకుల దినోత్సవం) సందర్భంగా సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరు అయ్యాను. లైవ్ వచ్చింది. ఎవరైనా చూసి ఉంటే వాళ్లకు నేను కనిపిస్తా. అలాగే, ఈ రోజు (సోమవారం) నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లాను. ఇప్పటి వరకు మా డ్యాన్సర్స్ సంఘంలో ఉన్నాను. ఇప్పటివరకు మా అసోసియేషన్ లో ఉన్న నేను ఎలా అక్కడ ప్రత్యక్షం అయ్యానో సదరు వార్త రాసిన, రాయించిన మతి లేని మహారథులకే తెలియాలి. చేతకానివాడు చెడగొట్టడానికి చూస్తాడు'' అని చెప్పారు. ఈ వివరణ కూడా పుకార్లు రాసిన వాళ్ల కోసం కాదని, తమ కుటుంబంలో తననూ ఓ సభ్యుడిలా వాళ్ళ కోసమని జానీ మాస్టర్ చెప్పారు.
Also Read: పిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి - పెళ్లాన్ని చిత్రహింసలు పెట్టిన త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ చందు
హైదారాబాద్ లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని, జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు.
— Jani Master (@AlwaysJani) May 20, 2024
నిన్న డైరక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కి, నేడు నా చిరకాల స్నేహితుడిని… pic.twitter.com/iCTccquFkN