News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Hyderabad Drug Case: డ్రగ్స్ కేసులో దర్శకుడు సహా రచయిత అరెస్టు, వాళ్లెవరంటే?

Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో దర్శకుడు మంతెన వాసు వర్మ, సినీ రచయిత మన్నేరి పృథ్వీకృష్ణను మాధాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. 

FOLLOW US: 
Share:

Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసుపై విచారణ సాగిస్తున్న మాధాపూర్ పోలీసులు యమ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా తెలుగు సినీ రంగానికి సంబంధించిన ఓ దర్శకుడు, సినీ రచయితను అరెస్టు చేశారు. డైరెక్టర్ మంతెన వాసు వర్మతో పాటు సినీ రచయిత పృథ్వీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి 70 గ్రాముల కొకైన్‌తోపాటు పెద్ద ఎత్తున విదేశీ మద్యం, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాయదుర్గం పోలీసులు డ్రగ్స్ కేసులో నిర్మాత కేవీ చౌదరిని జూన్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే నెలలో మరో డ్రగ్స్ కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులోనే వాసు వర్మ, పృథ్వీకృష్ణ నిందితులు. అయితే వాసు వర్మ బస్తీ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అతను పరారీలో ఉండడం, అతడు డైరెక్టర్ అని ఎవరికీ తెలియకపోవడంతో ఈ కేసు పెద్దగా ఫోకస్ కాలేదు. కానీ 20 రోజుల క్రితమే మాదాపూర్ పోలీసులు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

ముంబైకి చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ రాహుల్ అశోక్ వద్ద వీరిద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. అయితే సినీ రంగానికి చెందిన వాళ్లలో చాలా మంది డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులతోపాటు సెలబ్రిటీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడం గమనార్హం. మరోవైపు డ్రగ్స్ కేసులో భాగంగా టాలీవుడ్ హీరో నవదీప్ ని నార్కోటిక్ అధికారులు తాజాగా విచారించారు. దాదాపు 6 గంటల పాటు ఈ విచారణ జరిగినట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధం లేదంటూనే కొత్త విషయాన్ని బయట పెట్టాడు. నవదీప్ ఈ విచారణలో ఏం చెప్పాడు? అసలు ఏం జరిగింది? అనే వివరాలకు వెళ్తే.. సెప్టెంబర్ 14న తెలంగాణలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కదా. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

వీళ్ళందరిని విచారించగా వీళ్ళతో హీరో నవదీప్ సంప్రదింపులు జరిపినట్టు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. అయితే ఈ డ్రెస్ కేసులో నవదీప్ ని నిందితుడిగా చేర్చిన పోలీసులు, తాజాగా అతన్ని విచారించారు. ఈ క్రమంలోనే శనివారం దాదాపు 6 గంటలకు పైగా ఈ విచారణ సాగినట్టు తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన నవదీప్ మీడియాతో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

" డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చినందుకు నేను విచారణకు వచ్చాను. రామచందర్ అనే వ్యక్తి నాకు పరిచయమున్న మాట వాస్తవమే. కానీ అది పదేళ్ల క్రితం విషయం. ఈ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. నేను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు. గతంలో ఓ పబ్ ని నిర్వహించినందుకు నన్ను పిలిచి విచారించారు. గతంలో సిట్, ఈడి విచారిస్తే ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్ విచారిస్తుంది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తామని అన్నారు. అలానే ఏడేళ్ల పాత ఫోన్ రికార్డులను కూడా పరిశీలించి దర్యాప్తు చేశారు. డ్రగ్స్ కేసులో సీపీ సివి ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీం బాగా పనిచేస్తుంది. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతాను" అని నవదీప్ మీడియాతో చెప్పారు.

Published at : 25 Sep 2023 09:42 AM (IST) Tags: Hyderabad Drugs Case Hero Navadeep Comments Director Manthena Vasu Varma Arrest Writer Manneri Pruthvi Krishna Arrest

ఇవి కూడా చూడండి

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్

Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి