అన్వేషించండి

Pushpa Revealed : పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడనే - బన్నీ బర్త్‌డే గిఫ్ట్ వచ్చేసిందోచ్

Allu Arjun Birthday Special - Pushpa 2 Announcement Glimpse : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు గ్లింప్స్ విడుదల చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా 'పుష్ప' చిత్రానికి సీక్వెల్ (Pushpa Sequel)గా రూపొందుతున్న సినిమా 'పుష్ప 2'. రెండు మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఈ సినిమా సందడి. అల్లు అర్జున్ బర్త్ డే (Allu Arjun Birthday) సందర్భంగా ఈ రోజు గ్లింప్స్ విడుదల చేశారు. 

గ్లింప్స్ విడుదల చేయడానికి ముందు 'వేర్ ఈజ్ పుష్ప' అంటూ ఓ చిన్న వీడియో విడుదల చేశారు. అది చూస్తే... 'తిరుపతి జైలు నుంచి బుల్లెట్  గాయాలతో తప్పించుకున్న పుష్ప' అని వార్తల్లో రావడం, ప్రజలు, హడావిడి వీడియోలో అంశాలు అన్నీ హైప్ పెంచాయి. తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్పను ఈ రోజు చూపించారు. 

'పుష్ప' సినిమాలో కథానాయకుడిని కేవలం స్మగ్లర్ గా చూపించారు. అయితే, రెండో భాగంలో పుష్పను నాయకుడిని చేశారు. వేలమందికి అతడు సాయం చేసినట్టు చూపించారు. జైలు నుంచి తప్పించుకున్న పుష్ప కోసం తిరుపతి, చిత్తూరు ఏరియాల్లో నెలరోజుల ఆందోళన చేసినట్లు పేర్కొన్నారు. అతడు ఎక్కడ ఉన్నాడు? ఏమయ్యాడు? చైనా, మలేషియా, జపాన్ వంటి దేశాలు వెళ్ళారా? అని చర్చ జరుగుతుంది. చివరకు, అడవుల్లో ఉన్నట్టు చూపించారు. 

అడవిలో పులుల జాడ తెలుసుకోవడం కోసం నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అందులో ఓ పులి కనబడుతుంది. అది రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. అప్పుడు వెనుక ఓ డైలాగ్. 'అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వస్తే పుష్ప వచ్చాడని అర్థం' అని కేశవ చెప్పే డైలాగుతో పుష్ప ముఖాన్ని చీకటిలో చూపించారు. పుష్ప బతికి ఉన్నాడని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. 

Also Read 'రావణాసుర' రివ్యూ : రవితేజ సినిమా ఎలా ఉందంటే?

'పుష్ప'... ఇప్పుడు ఇది ఒక సినిమా పేరు కాదు, బ్రాండ్! పుష్పరాజ్ (Pushparaj)... ఇది ఒక క్యారెక్టర్ కాదు, చాలా మందికి ఎమోషన్! 'తగ్గేదే లే' అనేది ఎంతో మందికి ఊత పదంగా మారింది. ఆ మేనరిజమ్ వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యింది. దాంతో 'పుష్ప 2' (Pushpa 2 Movie) సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ రోజు సినిమా యూనిట్ విడుదల చేసిన చిన్న వీడియో మరిన్ని అంచనాలు పెంచింది. 
  
ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్. 

Also Read వాళ్ళిద్దరూ మళ్ళీ జంటగా దొరికేశారు

'పుష్ప' సినిమా విడుదల అయినప్పుడు ఎవరూ ఊహించలేదు. నార్త్ ఇండియాలో జనాలను ఆ సినిమా అంతలా ఆకట్టుకుంటుందని! తెలుగులో కంటే హిందీలో 'పుష్ప'కు ఎక్కువ లాభాలు వచ్చాయి. ఆ మాటకు వస్తే 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైనప్పుడు ఎవరైనా విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఊహించారా? లేదు కదా! థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ 'ఆర్ఆర్ఆర్'కు విదేశాల నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు తెలుగు సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది.

'పుష్ప 2' డిజిటల్ రైట్స్ 200 కోట్లు?
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న తెలుగు సినిమా 'పుష్ప 2'. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ భారీ సక్సెస్ సాధించడం... రెండో పార్ట్ మీద అంచనాలు పెంచింది. ఆ క్రేజ్ ఓటీటీ రైట్స్ విషయంలో కనబడుతోంది. 'పుష్ప 2' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం 200 కోట్ల రూపాయలు కోట్ చేస్తున్నారట. అంత భారీ మొత్తం అయినా సరే ఇచ్చి, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకోవాలని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ట్రై చేస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Jeevan Pramaan Patra: లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎందుకయ్యా నీకు రాజకీయాలు, మంత్రి వాసంశెట్టికి క్లాస్ పీకిన చంద్రబాబుRohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP DesamRishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Jeevan Pramaan Patra: లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
Chittoor News: పెద్దిరెడ్డిని కాదని కరుణాకర్‌రెడ్డికి జై కొట్టిన జగన్- అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
పెద్దిరెడ్డిని కాదని కరుణాకర్‌రెడ్డికి జై కొట్టిన జగన్- అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
Chiranjeevi: చిరంజీవికి నేషనల్ అవార్డు వచ్చేది.. చివరిక్షణంలో రాకుండా కుట్ర చేశారన్న నిర్మాత శ్రీరామ్
చిరంజీవికి నేషనల్ అవార్డు వచ్చేది.. చివరిక్షణంలో రాకుండా కుట్ర చేశారన్న నిర్మాత శ్రీరామ్
Kurnool News: నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
TET Notification: తెలంగాణలో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల, జాబ్ క్యాలెండర్ ప్రకారమే పరీక్ష నిర్వహణ!
తెలంగాణలో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల, జాబ్ క్యాలెండర్ ప్రకారమే పరీక్ష నిర్వహణ!
Embed widget