News
News
వీడియోలు ఆటలు
X

Aditi Rao Hydari - Siddharth : వాళ్ళిద్దరూ మళ్ళీ జంటగా దొరికేశారు - లవ్లీ జోడీ సిద్ధార్థ్ & అదితి

Aditi blushes as paps say lovely jodi at Jubilee Web Series Premiere : హిందీ వెబ్ సిరీస్ 'జూబ్లీ' ప్రీమియర్ గురువారం జరిగింది. దానికి సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా వచ్చారు.

FOLLOW US: 
Share:

సిద్ధార్థ్ (Siddharth), అదితి రావు హైదరి (Aditi Rao Hydari) ప్రేమలో ఉన్నారు. ఆ మాట వాళ్ళ ముందు అంటే... అవును అని గానీ, కాదు గానీ చెప్పడం లేదు. అది తమ పర్సనల్ అంటున్నారు. బయటకు మాత్రం జంటగా వస్తున్నారు. జోడీగా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరోసారి సిద్ధార్థ్, అదితి పబ్లిక్ ముందుకు జంటగా వచ్చారు. 

లవ్లీ జోడీ అంటుంటే సిగ్గుపడిన అదితి
అదితి రావు హైదరి ప్రధాన పాత్రలో నటించిన తాజా సిరీస్ 'జూబ్లీ' (Jubilee Web Series). అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో శుక్రవారం విడుదలైంది. అయితే, ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ గురువారం జరిగింది. దానికి అదితి రావు హైదరితో కలిసి వచ్చారు సిద్ధార్థ్. వాళ్ళిద్దరినీ రెడ్ కార్పెట్ మీద చూసిన ఫోటోగ్రాఫర్లు 'లవ్లీ జోడీ లవ్లీ జోడీ' అంటుంటే అదితి సిగ్గు పడ్డారు. ఈ రోజు ఉదయం సిద్ధార్థ్ సహా తన టీమ్ తో తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ప్రేమలో పడిన విషయం పైకి చెప్పడం లేదు గానీ సిద్ధార్థ్, అదితి రావు హైదరి రిలేషన్షిప్ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అన్నమాట!

Also Read 'రావణాసుర' రివ్యూ : రవితేజ సినిమా ఎలా ఉందంటే?

View this post on Instagram
 
A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

కొన్ని రోజుల క్రితం 'తాజ్ : డివైడెడ్ బై బ్లడ్' వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం అదితి రావు హైదరి హైదరాబాద్ వచ్చారు. సహజంగానే వెబ్ సిరీస్, ఓటీటీ ప్రమోషన్స్ అంటే వేరే ప్రశ్నలు అడగనివ్వరు. ఇక, లవ్ మ్యాటర్స్ తీస్తే ఎందుకు ఊరుకుంటారు? అయితే, ఇన్ డైరెక్టుగా సిద్ధూతో ప్రేమ వ్యవహారం, రీసెంట్ రీల్ గురించి అదితిని మీడియా ప్రశ్నించింది. సిద్ధూ పేరు తీయకుండా ఆమె కూడా సమాధానాలు ఇచ్చింది. 

పర్సనల్ అంటే పర్సనల్...
వ్యక్తిగత జీవితంలో గుడ్ న్యూస్ ఏమైనా చెబుతున్నారా? అని అడిగితే... ''పర్సనల్ అంటే పర్సనల్ కదా!'' అని తెలివిగా సమాధానం ఇచ్చారు. అయితే, సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి చూపించడం సహజమని, అది తనకు పెద్ద ఇబ్బంది కలిగించడం లేదని అదితి రావు హైదరి పేర్కొన్నారు. మెజారిటీ ప్రేక్షకులు చూపించే ప్రేమ ముందు కొన్ని కామెంట్స్ పట్టించుకోనని చెప్పారు. 

సిద్ధూతో రీల్... త్వరగా ప్యాకప్ కావడంతో  
ఇటీవల సిద్ధార్థ్, అదితి రావు హైదరి ఓ రీల్ చేశారు. అందులో పెళ్లి పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ రీల్ ప్రస్తావన తీసుకురాగా... ''నేను హ్యాపీగా ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తా. ఆ రోజు త్వరగా ప్యాకప్ అయ్యింది. ఏడు గంటలకు షూటింగ్ క్లోజ్ అయ్యింది. అందుకే, డ్యాన్స్ చేశా'' అని అదిరి రావు హైదరి చెప్పారు. అన్నట్లు... తనకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందని తెలిపారు.'మహా సముద్రం'లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి, శర్వానంద్ నటించారు. ఆ సినిమా సమయంలో మొదలైన సిద్ధూ, అదితి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని ఫిల్మ్ నగర్ టాక్. శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా ఇద్దరూ జంటగా వచ్చారు.

Also Read మీటర్ రివ్యూ: కిరణ్ అబ్బవరం ఊర మాస్ ‘మీటర్’ ఎలా ఉంది? రీడింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?

Published at : 07 Apr 2023 02:43 PM (IST) Tags: Siddharth Aditi Rao Hydari Jubilee Web Series

సంబంధిత కథనాలు

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Ponniyin Selvan 2 on OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియన్ సెల్వన్ 2' - ఇక నుంచి ఫ్రీగా చూడొచ్చు!

Ponniyin Selvan 2 on OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియన్ సెల్వన్ 2' - ఇక నుంచి ఫ్రీగా చూడొచ్చు!

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

విడుదలకు ముందే రూ.400 కోట్లు రాబట్టిన ‘ఆదిపురుష్’? - ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

విడుదలకు ముందే రూ.400 కోట్లు రాబట్టిన ‘ఆదిపురుష్’? - ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!

కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!