Harish Shankar: 'పుష్ప' చూసి అంతా స్మగ్లింగ్ చేస్తున్నారా? - డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై హరీష్ శంకర్ రియాక్షన్!
Harish Shankar Comments: డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ సినిమాల ప్రభావం ప్రజలప ఉంటుందనడం కరెక్ట్ కాదన్నారు.
Harish Shankar Reaction on Pawan Kalan Comments: డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆయన వరుస ఇంటర్య్వూలతో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా జనాలను సినిమా ప్రభావం ఉంటుందనే అంశంపై స్పందించారు. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే ఈ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించే విధంగా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ.. సినిమాల ప్రభావం ప్రజలపై ఉంటుందనడం సరికాదన్నారు.
ఒకవేళ అదే నిజమైతే 'గాంధీ' సినిమా చూసి అంతా మహాత్మ గాంధీలా మరిపోవాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అనంతరం తన వరకైతే సినిమా అనేది కేవలం వినోదం కోసమేన చూస్తారంటూ ఆయన చెప్పుకొచచారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించేలా ఉన్నాయంటున్నారు. ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ మీడియాతో అడువుల సంరక్షణ గురించి మాట్లాడారు. ఒకప్పుడు సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారు.. కానీ, ఇప్పుడు హీరోలే అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారన్నారు. ఒక సినిమా వ్యక్తిగా తాను అలాంటి ఎంకరేజ్ చేయనని, అలాంటి సినిమాలు బయటకు మంచి మెసేజ్ ఇవ్వలేవని అన్నారు.
దాంతో అంతా ఇవి అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాను ఉద్దేశించే చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంత్ ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ చేసిన ఈ తాజా కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలిచాయి. మిస్టర్ బచ్చన్ మీడియాలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "సినిమా ప్రభావం అనేది ప్రజలపై కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. నిజంగానే సినిమా చూసి మనుషులు మారిపోతారనడం కరెక్ట్ కాదు. సరే అదే నిజమనుకుంటే.. ‘పుష్ప’ సినిమా చూసిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ గొడ్డలి పట్టుకొని అడవుల్లోకి వెళ్లి స్మగ్లింగ్ చేయాలి. కానీ అలా చేయట్లేదు కదా! అలాగే ఠాగూరు చిత్రం చూసిన తర్వాత అధికారులు లంచం తీసుకోవడం మానేయాలి.
మరి మన ఆఫీసర్లు ఆ పని చేస్తున్నారా?.. సరే ఆస్కార్ అవార్డు గెలిసిన 'గాంధీ' సినిమా చూసి ప్రతి ఒక్కరు మహాత్మ గాంధీ అయిపోవాలి. అలా అయ్యారా? నటుడు అన్నాక అన్ని రకాల పాత్రలు చేస్తారు. ఏ సినిమా చేసిన వారి లక్ష్యం వినోదాన్ని పంచడమే. అలాంటిది సినిమాలో హీరోలను చూసి జనాలు మారిపోతారనేది నేను నమ్మను. నా వరకు సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే. నా సినిమాలతో నేను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ని మాత్రమే అందిస్తాను" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వైరల్ అవుతున్నాయి. ఏంటీ హరీష్ శంకర్ పవన కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిచారా? అంటూ కొందరు నెట్టింట చర్చ జరుపుతున్నారు. కాగా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌తో ఓజీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: వాడి మూడో కన్ను చూశారో.. శివతాండవమే - ఫుల్ యాక్షన్‌తో దద్దరిల్లిన సరిపోదా శనివారం ట్రైలర్