Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Naanaa Hyraanaa Lyrical Video: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ సాంగ్‌గా 'నానా హైరానా' రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ లిరికల్ వీడియో చూడండి.
చిన్న గ్లింప్స్... అదీ ఒక్క పాటలోని రెండు మూడు లైన్లు సింగర్స్ పాడుతుండగా చిన్న వీడియో గ్లింప్స్... ఆడియన్స్ అందరూ ఆ సాంగ్ కోసం వెయిట్ చేసేలా చేసింది. దీనికి మెయిన్ రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Music Director Thaman) అని చెప్పాలి. ఇప్పుడు ఆ సాంగ్ 'నానా హైరానా' ఫుల్ లిరికల్ వీడియో వచ్చేసింది.
'గేమ్ చేంజర్'లో నానా హైరానా...
చరణ్, కియారా జోడీ సూపర్ ఉందమ్మా!
Ram Charan In Naanaa Hyraanaa Lyrical Video: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నార్త్ ఇండియన్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా 'గేమ్ చేంజర్'. ఈ జంట ఇంతకు ముందు ఓ సినిమా చేసింది. అయితే... ఇంత అందంగా ఇంతకు ముందెప్పుడూ కనిపించలేదని చెప్పాలి. సాంగ్స్ తీయడంలో తన మార్క్ ఎప్పుడూ సూపర్ అని శంకర్ మరోసారి ప్రూవ్ చేశారు.
'గేమ్ చేంజర్' సినిమాలోని మూడో పాట 'నానా హైరానా' లిరికల్ వీడియో విడుదల చేశారు. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్‌లో తమన్ బాణీకి తోడు శ్రేయా ఘోషల్, కార్తీక్ వాయిస్ మళ్లీ మళ్లీ వినేలా ఉంటే... ఫుల్ లిరికల్ వీడియో లూప్ లో వినేలా ఉంది. ఇప్పట్లో ఈ సాంగ్ మైండ్ లో నుంచి వెళ్లడం కష్టమే. తమన్ టాప్ క్లాస్ ట్యూన్ ఇవ్వగా... సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం అంతే అందంగా ఉంది. శంకర్ మార్క్ పిక్చరైజేషన్ పాటను నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్లింది.
Also Read: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
డైరెక్టర్ శంకర్ ఈజ్ బ్యాక్...
ఒక్క పాటతో పెరిగిన అంచనాలు!
'గేమ్ చేంజర్'కు ముందు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన 'ఇండియన్ 2' (తెలుగులో 'భారతీయుడు 2') థియేటర్లలోకి వచ్చింది. ఆశించిన విజయం సాధించలేదు. ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వం మీద కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన టచ్ లేదని పెదవి విరిచారు. ఆ ప్రభావం రామ్ చరణ్ సినిమా మీద ఉండొచ్చని పేర్కొన్నారు. కానీ, ఒక్క పాట 'నానా హైరానా'తో శంకర్ ఈజ్ బ్యాక్ అనిపించారు. సినిమాపై అంచనాలు భారీగా పెంచారు.
Also Read: దేవకీ నందన వాసుదేవ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడు అశోక్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలు ఏంటి?
#NaanaaHyraanaa is all yours 😊💜#MelodyOfTheYear from #GameChanger is here, to paint the city in love 💜
— Sri Venkateswara Creations (@SVC_official) November 28, 2024
🔗https://t.co/QbOrPdIUAL
A @MusicThaman melody! 🎶
Sung By @shreyaghoshal @singer_karthik 🎙
Choreographed by @BoscoMartis
Lyrics: “SaraswathiPuthra” @ramjowrites…
సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా 'గేమ్ చేంజర్'
సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'గేమ్ చేంజర్' విడుదల అవుతోంది. పండక్కి వస్తున్న సినిమాల్లో ఇది ఫేవరెట్ సినిమా అని చెప్పవచ్చు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథతో శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, జయరామ్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. తెలుగు అమ్మాయి అంజలి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కథానాయికగా కనిపించనున్నారు.