అన్వేషించండి

Sunny Deol - Gadar 2 Collections : తారా సింగ్ @ 260 కోట్లు - బాక్సాఫీస్ బరిలో సన్నీ డియోల్ దూకుడు తగ్గట్లేదుగా

'ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా? లేదా?' - ఇదీ 'పోకిరి'లో మహేష్ బాబు డైలాగ్. హిందీ సినిమా 'గదర్ 2' కలెక్షన్స్ విషయంలో ఈ డైలాగ్ సరిపోతుంది ఏమో!?

ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా? లేదా? - 'పోకిరి'లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చెప్పిన పంచ్ డైలాగుల్లో ఇదొకటి. డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రాసిన ఈ డైలాగ్... ప్రస్తుతం హిందీ చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గదర్ 2' (Gadar 2 Movie) కలెక్షన్స్ గురించి చెప్పడానికి సరిగ్గా సరిపోతుందేమో!?

సీక్వెల్... అదీ 22 ఏళ్ళ తర్వాత!
'గదర్' సినిమాలో సన్నీ డియోల్ (Sunny Deol) హీరో. ఆయనకు జోడీగా హీరోయిన్ అమీషా పటేల్ నటించారు. వీళ్ళిద్దరూ జంటగా నటించిన 'గదర్ : ఏక్ ప్రేమ్ కథ'లో జంటగా నటించారు. ఎప్పుడో 2011లో... అంటే 22 ఏళ్ళ క్రితం విడుదల అయ్యింది. అప్పట్లో ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ వచ్చింది. 'గదర్ 2' విడుదలకు ముందు కొంత మంది సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు సన్నీ డియోల్ మార్కెట్ అంత లేదుగా? 22 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా గుర్తు ఉంటుందా? వంటి కామెంట్స్ కూడా వినిపించాయి. వాటన్నిటికీ బాక్సాఫీస్ కలెక్షన్లతో సన్నీ డియోల్ సమాధానం చెబుతున్నారు. 

'గదర్ 2' @ 260 కోట్లు
ఆగస్టు 11న 'గదర్ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచి, తొలి ఆట నుంచి ఈ సినిమాకు హిట్ టాక్ లభించింది. బాక్సాఫీస్ బరిలో బ్లాక్ బస్టర్ అందుకున్నారు సన్నీ డియోల్. తారా సింగ్ పాత్రలో తనదైన నటనతో ఆయన ఆకట్టుకున్నారు. 

Also Read : 'శాకుంతలం' నష్టాలు కవర్ చేస్తున్న రజనీకాంత్ 'జైలర్'

విడుదలైన ఐదు రోజుల్లో 'గదర్ 2' సినిమా 229 కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్ అందుకుంది. అదీ కేవలం ఇండియాలో వసూళ్లు మాత్రమే. ఆరో రోజైన ఆగస్టు 16న కూడా సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. మొత్తం మీద ఈ సినిమా 260 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రజెంట్ నార్త్ ఇండియాలో ఈ సినిమా జోరు చూస్తుంటే... షారుఖ్ ఖాన్ 'పఠాన్' రికార్డులు బ్రేక్ కావడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 

హైదరాబాద్ వచ్చిన సన్నీ డియోల్
నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియాలోని ప్రధాన నగరాల్లో కూడా 'గదర్ 2'కు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా సన్నీ డియోల్ బుధవారం భాగ్య నగరం (Hyderabad) వచ్చారు. ఏఎంబీ సినిమాస్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, టాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి, ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు సన్నీ డియోల్ ధన్యవాదాలు తెలియజేశారు. అక్షయ్ కుమార్ 'ఓ మై గాడ్ 2' కంటే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తుండటం విశేషం. 

అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్కర్ష శర్మ, సిమ్రత్ కౌర్, మనీష్ వాధ్వా, అర్జున్ ద్వివేది  కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో అనిల్ శర్మ, కమల్ ముకుత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Also Read థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్, బుక్ మై షోలో సోల్డ్ అవుట్ - ధనుష్ సినిమాకు భారీ క్రేజ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget