మెగాస్టార్ మూవీని రిజెక్ట్ చేసిన DJ టిల్లు - అతని స్థానంలో మరో యంగ్ హీరోకి ఛాన్స్!
'DJ' టిల్లు సినిమాతో ఇండస్ట్రీలో భారీ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకి తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ రాగా.. సిద్దు దాన్ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'DJ టిల్లు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఈ మూవీ సక్సెస్ తో సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయింది. DJ టిల్లు తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ డిమాండ్ ఉన్న హీరోగా మారాడు సిద్దు. త్వరలోనే డిజె టిల్లు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ మధ్య సిద్దు జొన్నలగడ్డ కి ఏకంగా మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ యంగ్ హీరో ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునేవాడు. కానీ ఆ అవకాశాన్ని సిద్దు సద్వినియోగం చేసుకోలేదు.
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 'భోళాశంకర్' సినిమాలో నటిస్తున్న చిరు ఈ మూవీ తర్వాత బంగార్రాజు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో ఓ సినిమాకి కమిట్ అయ్యారు. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన 'బ్రో డాడీ' అనే సినిమాకి ఈ ప్రాజెక్టు రీమేక్ గా ఉండబోతోంది. ఈ 'బ్రో డాడీ' రీమేక్లో చిరంజీవి కొడుకుగా నటించేందుకు సిద్దు జొన్నలగడ్డను మూవీ టీం సంప్రదించింది. కానీ సిద్దు మాత్రం ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి రీజన్ ఏంటో తెలియకపోయినా మెగాస్టార్ మూవీలో ఛాన్స్ వస్తే దాన్ని సిద్ధు రిజెక్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సిద్దు జొన్నలగడ్డ రిజెక్ట్ చేయడంతో అతని స్థానంలో మరో యంగ్ హీరోని వెతికే పనిలో పడిందట చిత్ర బృందం.
ఈ క్రమంలోనే సిద్దు రిజెక్ట్ చేసిన ఆ పాత్ర కోసం హీరో శర్వానంద్ పేరుని మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఈ రీమేక్ లో చిరంజీవి కొడుకుగా శర్వానంద్ ని ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. కాగా ఈ ఆఫర్ ని సిద్దు రిజెక్ట్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయంటూ ఇప్పటికే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి పక్కన నటిస్తే తనకు యాక్టింగ్ స్కోప్ తక్కువ ఉంటుందని, ప్రేక్షకుల దృష్టి అంతా మెగాస్టార్ పైనే ఉంటుందని, తనకు స్క్రీన్ స్పేస్ కూడా తక్కువ ఉంటుందని సిద్దు ఈ రీమేక్ లో నటించిన ఆసక్తి చూపు లేదట. మరోవైపు ఈ రీమేక్ కోసం సిద్ధూ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని, దానికి నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో రిజెక్ట్ చేశాడంటూ రకరకాల కారణాలు తెరపైకి వచ్చాయి.
కానీ ఇందులో ఏది వాస్తవం అనేది తెలియదు. ఇక 'బ్రో డాడీ' విషయానికి వస్తే.. మలయాళం లో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రీకొడుకులుగా నటించిన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ ఇమేజ్ కి అనుగుణంగా పలుమార్పులు చేర్పులతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించబోతున్నారు. ముఖ్యంగా సినిమాలో తండ్రీ, కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ గాను చూపించనున్నారు. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాని నిర్మించనున్నారు.
Also Read : ధ్యానంలో సమంత - సద్గురు ఆశ్రమంలో క్లేష నాశన క్రియలో...
Join Us on Telegram: https://t.me/abpdesamofficial