అన్వేషించండి

OG Sequel: 'OG' సీక్వెల్‌లో అకీరా నందన్ - సుజీత్ రియాక్షన్ ఇదే... నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చేశారుగా...

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' సీక్వెల్‌ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే, ఇందులో ఆయన కుమారుడు అకీరా నటిస్తారా అన్న ప్రశ్నకు డైరెక్టర్ సుజీత్ రియాక్ట్ అయ్యారు.

Director Sujeeth About Pawan Kalyan OG Sequel: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డైరెక్టర్ సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత డీవీవీ దానయ్య గురువారం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 'ఓజీ' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సుజీత్.

అకీరాతో సీక్వెల్‌పై...

'OG' మూవీకిి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్‌లోనే క్లారిటీ ఇచ్చేశారు సుజీత్. 'రెండో పార్ట్‌లో పవన్ కుమారుడు అకీరా నందన్ నటిస్తారా?' అంటూ ఎదురైన ప్రశ్నకు సుజీత్ స్పందించారు. ఈ విషయాన్ని మీరు పవన్ కల్యాణ్‌నే అడగాలని అన్నారు. 'అకీరాతో మూవీ తీస్తే హ్యాపీనే కదా. 'ఓజీ' షూటింగ్ జరుగుతున్న టైంలో అకీరా సెట్స్‌కు వచ్చారు. తనలో ఓ స్పార్క్ ఉంది. ప్రస్తుతానికి ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను. ఏది చెప్పినా అది ఎక్కడెక్కడికో వెళ్తుంది. అందుకే దాని గురించి ఎక్కువ మాట్లాడను.

ప్రెజెంట్ అందరూ 'ఓజీ' హైప్‌లో ఉన్నారు. సక్సెస్ మూమెంట్‌ను ఫ్యాన్స్‌తో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత సీక్వెల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.' అంటూ హైప్ క్రియేట్ చేశారు.

Also Read: స్వీటీ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి' - 4 భాషల్లో స్ట్రీమింగ్... ఈ ఓటీటీలో ఇప్పుడే చూసెయ్యండి

సుజీత్ యూనివర్స్‌లో ప్రభాస్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'OG' మూవీ చూసి తనకు మెసేజ్ చేసినట్లు చెప్పారు డైరెక్టర్ సుజీత్. రిలీజ్‌కు ముందు కచ్చితంగా హిట్ కొడతావని చెప్పారని... అనుకున్నట్లుగానే మూవీ ఘన విజయం సాధించిందని అన్నారు. 'బంగారం కొట్టేశావ్ రా' అంటూ లవ్ సింబల్‌తో ప్రభాస్ మెసేజ్ చేసినట్లు తెలిపారు. 'సాహో' రిలీజ్ అయ్యాక ఇంకో మూవీ చేద్దామని ప్రభాస్ అన్నా... హిట్ కొట్టాకే మళ్లీ వస్తానని ఆయనతో చెప్పినట్లు వెల్లడించారు.

ఓజీకి ప్రభాస్ 'సాహో'తో లింక్ పెట్టడంతో సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ యూనివర్స్‌లో ప్రభాస్ నటిస్తారా? అని అడగ్గా... 'యూనివర్స్‌లో ఈ ఇద్దరు హీరోల గురించి తర్వాత ఆలోచిస్తా. ప్రభాస్ అన్న నాకు బాగా దగ్గరైన వ్యక్తి. పవన్ కల్యాణ్ సర్‌తో 'ఓజీ' వల్ల అనుబంధం ఏర్పడింది. యూనివర్స్ గురించి ఇప్పుడే ఏం ఆలోచించను. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అనే పేరును మా టీం ప్రకటించింది. ఇది వర్కవుట్ అయితే చాలా మంచిది. అప్పుడు దీని గురించి ఆలోచిస్తా. నేను తీయబోయే అన్నీ సినిమాలు ఈ యూనివర్స్‌లో కలపాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం ఓజీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నా. ప్రీమియర్స్ సందడితో ఓజీ అసలు ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా అర్థం కావడం లేదు.' అంటూ నవ్వులు పూయించారు.

నెక్స్ట్ ప్రాజెక్టుపై...

ఇక ఇదే ఇంటర్వ్యూలో సుజీత్ తన నెక్స్ట్ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. తన తర్వాత మూవీ నేచరల్ స్టార్ నానితో చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే మూవీ స్క్రిప్ట్ పూర్తైందని నాలుగైదు రోజుల్లో అనౌన్స్‌మెంట్ ఉంటుందని అన్నారు. 'నానితో చేయబోయే మూవీ రన్ రాజా రన్‌లా ఉంటుంది. మూవీ షూట్ కష్టంతో పాటు ప్రయోగాత్మకంగా ఉండబోతోంది. యాక్షన్ అనేది నా బ్లడ్‌లోనే ఉంది. స్టోరీలోనూ అదే కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తుంది.' అంటూ చెప్పారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Advertisement

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget