Ghaati OTT: స్వీటీ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి' - 4 భాషల్లో స్ట్రీమింగ్... ఈ ఓటీటీలో ఇప్పుడే చూసెయ్యండి
Ghaati OTT Platform: స్వీటీ అనుష్క 'ఘాటి' ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

Anushka Shetty's Ghaati OTT Streaming On Amazon Prime Video: స్వీటీ అనుష్క లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి' ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. తాజాగా ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ ఓటీటీలో స్ట్రీమింగ్
ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో గురువారం అర్ధరాత్రి నుంచి 'ఘాటి' స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 'పర్వతాల నుంచి రహస్యం మీ తెరలపైకి వచ్చింది.' అంటూ సదరు ఓటీటీ సంస్థ క్యాప్షన్ ఇస్తూనే ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
చాలా రోజుల గ్యాప్ తర్వాత అనుష్క యాక్షన్ థ్రిల్లర్‌లో తన నటనతో మెప్పించారు. ఆమె లుక్స్, యాక్షన్ సీన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. మూవీలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, రవీంద్ర విజయ్, చైతన్యరావు, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.
Also Read: ప్లీజ్... నన్ను ఒంటరిగా వదిలేయండి - ఆమిర్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్ ఆగ్రహం
స్టోరీ ఏంటంటే?
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో తూర్పు కనుమల్లో పండే మేలిరకం గంజాయి శీలావతి చుట్టూ ఈ కథ సాగుతుంది. ఎత్తైన పర్వతాల మధ్య ప్రాంతాల్లో 4 రాకల గంజాయి సాగు చేయగా అందులో శీలావతి అరుదైన రకం. అక్కడ ఘాటి తెగ కూలీలతో గంజాయిని అక్రమ రవాణా చేస్తూ దందా సాగిస్తుంటారు కుందుల నాయుడు (చైతన్యరావు) కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్). ఆ ప్రాంతాల్లో వీరిద్దరిదే ఆధిపత్యం. పోలీసుల కంట పడకుండా శీలావతి గంజాయిని ఘాటి కూలీలు వీరికి చేరవేస్తే... వీరు తమ బాస్ మహావీర్ (జిషు షేన్ గుప్తా)కు అందిస్తారు.
ఆ ప్రాంతాల్లో వేరే ఎవరైనా గంజాయి వ్యాపారం చేసినా... వీరికి పోటీ వచ్చినా ఇద్దరు సోదరులు వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అయితే, ఘాటీలకు కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదని భావించిన అదే తెగకు చెందిన దేశీరాజు (విక్రమ్ ప్రభు), తన మరదలు శీలావతి (అనుష్క)తో కలిసి ఓ ప్లాన్ చేస్తాడు. గంజాయిని ద్రవ రూపంలో మార్చి అక్రమంగా రవాణా చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న నాయుడు బ్రదర్స్ వారికి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో దేశీరాజు, శీలావతి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అసలు వారి నుంచి వీరు ఎలా తప్పించుకున్నారు? తనకు తీవ్ర అన్యాయం చేసిన నాయుడు బ్రదర్స్‌పై శీలావతి ఎలా పగ తీర్చుకుంది? దేశీరాజు ఆ డబ్బులతో ఏం చేశాడు? అసలు దేశీరాజు శీలావతిల ధ్యేయం ఏంటి? శీలావతి ఘాటిలకు నాయకురాలిగా ఎలా ఎదిగింది? ఈ ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















