Sandeep Raj Marriage: హీరోయిన్‌తో దర్శకుడి సందీప్ రాజ్ పెళ్లి... 'కలర్ ఫోటో' నుంచి రియల్ లైఫ్‌లో వెడ్డింగ్ వరకూ!
Sandeep Raj Wedding: ‘కలర్ ఫొటో’తో నేషనల్ అవార్డ్ అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ఓ ఇంటివాడయ్యాడు. ఆ సినిమాలో నటించిన చాందినీ రావుతో శనివారం తిరుమలలో వివాహం చేసుకున్నారు.
Color Photo movie Director Sandeep Raj wedding: ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్, అదే చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన చాందినీ రావు అనే నటిని పెళ్లాడి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి తిరుమలలో శనివారం ఉదయం గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లికి ‘కలర్ ఫొటో’ టీమ్ హీరో సుహాస్, అందులో కీలక పాత్రలో నటించిన వైవా హర్ష వంటి వారంతా హాజరై సందడి చేశారు.
వాస్తవానికి సందీప్ రాజ్, చాందినీ రావుల మధ్య ‘కలర్ ఫొటో’ మూవీ చిత్రీకరణ టైమ్ నుండి ప్రేమ నడుస్తున్నట్లు తెలిసింది. నార్మల్‌గా దర్శకుడు, నటిలా పరిచయమైన వారిద్దరూ ఆ సినిమా పూర్తయ్యే లోపు ప్రేమికులుగా మారారు. వారి ప్రేమను పెద్దలకు చెప్పి, వారి నుండి అంగీకారం వచ్చిన తర్వాత వారి సమక్షంలోనే గ్రాండ్‌గా నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకుని.. ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. వారి పెళ్లి విషయం తెలిసిన వారంతా.. నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆశీస్సులు అందిస్తున్నారు.
సందీప్ రాజ్ విషయానికి వస్తే.. షార్ట్ ఫిల్మ్‌లతో ఫేమస్ అయిన సందీప్.. సుహాస్‌తో తీసిన ప్రేమకథ ‘కలర్ ఫొటో’తో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమా సుహాస్‌కే కాకుండా దర్శకుడు సందీప్ రాజ్‌కి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘కలర్ ఫొటో’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు.. ఉత్తమ చిత్రం తెలుగు కేటగిరీలో నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. దీంతో సందీప్ రాజ్ పేరు టాలీవుడ్ అంతా మారుమోగింది. అయితే ఆ సినిమా తర్వాత ఆయన ఫీచర్ ఫిల్మ్ తీయడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. మధ్యలో ఓటీటీలకు వెబ్ సిరీస్‌లు డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం సుమ కనకాల, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాలతో ‘మోగ్లీ’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.
చాందినీ రావు విషయానికి వస్తే.. ఆమె క్లాసికల్ డ్యాన్సర్‌గా మంచి పేరును సంపాదించుకున్నారు. ‘లవ్ డ్రైవ్’ అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ చిన్నది.. సందీప్ తెరకెక్కించిన ‘కలర్ ఫొటో’ సినిమాతో పాటు, ‘హెడ్స్ అండ్ టేల్స్’ అనే వెబ్ సిరీస్‌లోనూ ఓ కీలక పాత్రలో నటించారు. నవంబర్ 11న చాందిని, సందీప్ రాజ్‌ల నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థం విషయం ఎవరికీ తెలియను కూడా తెలియదు. తర్వాత వారే సోషల్ మీడియా వేదికగా తమకు నిశ్చితార్థం జరిగినట్లుగా ప్రకటించారు. అంతే అప్పటి నుండి ఎవరి చాందిని అని అంత సెర్చ్ చేశారు. ఒకానొక దశలో చాందిని అనే పేరు కనబడగానే ‘కలర్ ఫొటో’ సినిమాలో హీరోయిన్ చాందిని చౌదరి అని అంతా అనుకున్నారు. కానీ వారు ఫొటో కూడా షేర్ చేయడంతో ఈ చాందిని ఆ చాందిని కాదని క్లారిటీకి వచ్చారు. ప్రస్తుతం చాందినీ రావు, సందీప్ రాజ్‌ల పెళ్లికి సంబంధించి కొన్ని ఫొటోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
Also Read: నా కోసం కాదు, వాళ్ళ కోసం... ఆ మూడుసార్లూ Pushpa 2 హిట్టవ్వాలని బలంగా కోరుకున్నా - అల్లు అర్జున్