అన్వేషించండి

Hari Hara Veera Mallu: పవన్ డిజైన్ చేసిన ఫైట్... మూవీకే హైలైట్ - 'హరిహర వీరమల్లు' యాక్షన్ సీక్వెన్స్‌పై జ్యోతికృష్ణ రియాక్షన్

Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' మూవీలో పవన్ స్వయంగా ఓ ఫైట్ డిజైన్ చేశారని... అది మూవీకే హైలెట్ అని డైరెక్టర్ జ్యోతికృష్ణ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Director Jyothi Krishna About HHVM Action Sequence: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ పీరియాడికల్ అడ్వెంచర్ 'హరిహర వీరమల్లు' ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యోధుడిగా పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు పవన్. ట్రైలర్ చూస్తేనే హైప్ పదింతలు కాగా... ఇక మేకింగ్ వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ పక్కా.

మూవీ టీం ఇప్పటికే ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 'హరిహర వీరమల్లు' గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణ, ప్రొడ్యూసర్ ఎఎం రత్నం తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా వార్ సీక్వెన్స్ కోసం పవన్ చాలా శ్రమించారని జ్యోతికృష్ణ తెలిపారు. 

పవన్ డిజైన్ చేసిన ఫైట్

ఈ మూవీలో ఓ ఫైట్ ఎపిసోడ్‌ను పవన్ డిజైన్ చేశారని... ఆయన ఫైట్స్ డిఫరెంట్‌గా ఉంటాయని తెలిపారు జ్యోతికృష్ణ. 'పవన్ కల్యాణ్ ఫైట్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రతీ దానిలో ఆయన మార్షల్ ఆర్ట్స్ స్కిల్ కనిపిస్తుంది. సినిమాలో ఫైట్స్ దేనికవే చాలా స్పెషల్. ఓ ఫైట్ ఎపిసోడ్‌ను స్వయంగా పవనే డిజైన్ చేశారు. దాదాపు 60 రోజులు ఆ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాం. డూప్స్ కాకుండా పవన్ స్వయంగా యాక్షన్ సీక్వెన్స్ చేశారు. బ్రూస్ లీ 'ఎంటర్ ది డ్రాగన్'ను తలపించే ఫైట్ సీన్ అది. ఆ వార్ సీక్వెన్స్ చూస్తే ఆడియన్స్‌కు గూస్ బంప్స్ పక్కా.

4 రకాల వెపన్స్‌తో వార్ సీక్వెన్స్ కోసం పవన్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. విదేశీ స్టంట్ మాస్టర్లతో పాటు పీటర్ హెయిన్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని ఓ పవర్ ఫుల్ రోల్‌లో పవన్‌ను చూడబోతున్నాం.' అని చెప్పారు.

Also Read: వీరమల్లుకు ముందు... నిధి అగర్వాల్ చేసిన సినిమాలు... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?

పవన్ డైరెక్ట్ చేయాల్సిన మూవీ!

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు 'హరిహర వీరమల్లు' ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రొడ్యూసర్ ఎఎం రత్నం తెలిపారు. తన సినీ జర్నీలో ఇదే సుదీర్ఘ ప్రయాణమని... కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'పవన్ కల్యాణ్‌తో గతంలో 'సత్యాగ్రహి' మూవీ నిర్మించాలని ప్లాన్ చేశాను. ఆ మూవీని ఆయనే స్వయంగా డైరెక్ట్ చేయాలని అనుకున్నారు. ఏఆర్ రెహమాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుకున్నాం. టైటిల్ అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలతో మూవీని ప్రారంభించాం. కానీ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది.

'సత్యాగ్రహి' సినిమా చేసుంటే సూపర్ హిట్ అయ్యేది అని పవన్‌తో ఇటీవల అన్నాను. 'అవును ఆ సినిమా సూపర్ హిట్ అయితే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌లా మూవీస్ చేస్తూ ఉండేవాడిని. పాలిటిక్స్‌లోకి వచ్చే వాడిని కాదు.' అని పవన్ అన్నారు.' అని రత్నం చెప్పారు. అటు, ఐదేళ్ల సినీ ప్రయాణం తనలో మార్పు తీసుకొచ్చిందని హీరోయిన్ నిధి అగర్వాల్ తెలిపారు.

ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా 'హరిహర వీరమల్లు' రిలీజ్ కానుండగా... ఇప్పటికే టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. పెయిడ్ ప్రీమియర్ షోస్ కూడా వేయనున్నారు. ఈ నెల 21న హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా... దర్శక ధీరుడు రాజమౌళి, ఇతర సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - ఫేక్ అని నిరూపించుకున్న జబర్దస్త్ వెంకీ
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - ఫేక్ అని నిరూపించుకున్న జబర్దస్త్ వెంకీ
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget