Dil Raju : 'దిల్' రాజు విడుదల చేసిన ట్రైలర్ - కృష్ణగాడు అంటే ఒక రేంజ్!
Krishna Gadu Ante Oka Range Trailer : 'దిల్' రాజు చిన్న చిత్రాలు నిర్మించడమే కాదు... చిన్న చిత్రాలకు అండగా కూడా ఉంటున్నారు. ఆయన లేటెస్టుగా ఓ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
'బలగం' భారీ వసూళ్లు, విజయం సాధించింది. అయితే... విడుదలకు ముందు అది చిన్న చిత్రమే కదా! అగ్ర నిర్మాత 'దిల్' రాజు (Dil Raju) అటువంటి చిన్న చిత్రాలు ప్రొడ్యూస్ చేయడమే కాదు... చిన్న చిత్రాలకు అండగా సహాయ సహకారాలు కూడా అందిస్తుందంటారు. లేటెస్టుగా ఆయన ఓ చిన్న సినిమా ట్రైలర్ విడుదల చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
కృష్ణ గాడు అంటే ఒక రేంజ్...
రిష్వి తిమ్మరాజు (Rishvi Thimmaraju) కథానాయకుడిగా, విస్మయ శ్రీ (Vismaya Sri) కథానాయికగా నటించిన సినిమా 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్'. రాజేష్ దొండపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ తేజస్ ప్రొడక్షన్ పతాకంపై పెట్లా కృష్ణ మూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పి.ఎన్.కె శ్రీలత సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 4న థియేటర్లలోకి వస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... అగ్ర నిర్మాత 'దిల్' రాజు బుధవారం ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అసలు కృష్ణగాడి కథ ఏమిటంటే?
అనగనగా ఓ అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో కృష్ణ అనే చలాకీగా తిరిగే హుషారు కల కుర్రాడు ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి అతనికి ఆ ఊరితో ఎంతో మంచి అనుబంధం ఉంటుంది. కృష్ణకు ఆ ఊరే ప్రపంచం. అటువంటి అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి వస్తుంది. ఎంతో సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో అమ్మాయి రాకతో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అవి ఏమిటి? తండ్రి కోరికను కృష్ణ ఎలా నేరవేర్చాడు? కృష్ణ అనుకున్న పని సాధించాడా? లేదా? తన ప్రేమను ఏ విధంగా గెలుచుకున్నాడా? వంటి విషయాలు తెలియాలి అంటే... 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' సినిమా చూడాలని దర్శకుడు రాజేష్ దొండపాటి చెప్పారు.
Also Read : తెలుగులోకి తమన్నా ట్రెండింగ్ సాంగ్ - మాస్ & స్పైసీ గురూ!
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ''ఇప్పటి వరకు టీజర్, మూడు సాంగ్స్ విడుదల చేశాం. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఆల్రెడీ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ చేసిన సినిమా అయినా ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే... యువతకు నచ్చే అంశాలతో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని అనిపిస్తునట్లు కొందరు చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది'' అని చెప్పారు.
Also Read : అమెరికాలో చిరంజీవి కాలికి సర్జరీ - సమస్య ఏమిటంటే?
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటించిన ఈ సినిమాలో రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఎడిటర్ : సాయి బాబు తలారి, పాటలు : వరికుప్పల యాదగిరి, ఛాయాగ్రహణం : ఎస్.కె. రఫీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రాఘవేంద్ర రావు, నిర్మాణ సంస్థ : శ్రీ తేజస్ ప్రొడక్షన్, సంగీతం : సాబు వర్గీస్, నిర్మాతలు : పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, కథ - కథనం - దర్శకత్వం : రాజేష్ దొండపాటి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial