By: ABP Desam | Updated at : 30 Jun 2023 07:20 PM (IST)
Photo Credit: Dhanush/Instagram
కోలీవుడ్ అగ్ర హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఏకైక హీరో ధనుష్ అనే చెప్పాలి. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం 'కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాథేశ్వర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ధనుష్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో ధనుష్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాల నెలకొన్నాయి. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి గత కొంతకాలంగా ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో ధనుష్ ఫాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఈ క్రమంలోనే తాజాగా ధనుష్ తన ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ చెబుతూ ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ ని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. 1930 - 1940 నాటి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇక తాజాగా విడుదలైన ధనుష్ ఫస్ట్ పోస్టర్లో చేతిలో పెద్ద గన్ తో రగ్గుడ్ లుక్ ల్ ధనుష్ ఆకట్టుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో అతని చుట్టూ పోలీసుల మృతదేహాలు, దూరంగా వాహనాలతో కూడిన యుద్ధంలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్లో ధనుష్ మేకోవర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ 'రెస్పెక్ట్ ఇస్ ఫ్రీడమ్' అంటూ ధనుష్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
కాగా జూలైలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ధనుష్ తో పాటు ఈ సినిమాలో కన్నడ అగ్ర నటుడు శివరాజ్ కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, సతీష్, నివేదిత RRR ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక రీసెంట్ గా తెలుగులో 'సార్' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు ధనుష్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమాకి రెండు చోట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్స్ని అందుకుంది. ధనుష్ కి ఇది ఫస్ట్ స్ప్రైట్ తెలుగు మూవీ కావడం విశేషం. ఇక సార్ హిట్ తర్వాత మన టాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ధనుష్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే
Raveena Tandon: ఆయన పెదాలు తాకగానే- షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రవీనా టాండన్!
Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?
Ritika Singh: ఆ ఘటన చూసి గుండె మండింది, ఇబ్బంది అనిపించినా అమ్మాయిలకు వాటిని నేర్పించాల్సిందే
Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్లో అత్యధిక ఓపెనింగ్!
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
World Cup 2023: హైదరాబాద్లో పాక్xకివీస్ వార్మప్ మ్యాచ్! వర్షం కురిసే ఛాన్స్!
ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్ - సరిహద్దుల్లో భారీ భద్రత
Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్ రామస్వామి
/body>