Devara Count Down: భయానికి మారుపేరు ‘దేవర’, అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ సినిమా విడుదలకు మేకర్స్ కౌంట్ డౌన్ షురూ చేశారు. ఈ మేరకు ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు.
‘RRR’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడులైన పోస్టర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఓ రేంజిలో ఉండబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ‘దేవర’ సినిమా విషయంలో దర్శకుడు కొరటాల శివ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. గత కొంత కాలంగా కంటిన్యూగా షూటింగ్ కొనసాగిస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ సైతం పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా గోవా షెడ్యూల్ సైతం పూర్తి అయ్యింది. అయితే, ఈ షెడ్యూల్ అనుకున్న సమయాని కంటే ముందే కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
‘దేవర’ కౌంట్ డౌన్ షురూ!
ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ విషయంలో కొరటాల శివ టీమ్ ఆచితూచి వ్యవహరిస్తోంది. సినిమా పై హైప్ మరింత పెంచేలా వ్యవహరిస్తోంది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ సినిమా విడుదలకు మరో 150 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. భయానికి మరో పేరు ‘దేవర’ అంటూ అనౌన్స్ చేసింది. “భయానికి మరో పేరు దేవర. 150 రోజుల్లో పెద్ద స్క్రీన్‌లలో అత్యంత భారీ ప్రదర్శనను చూసేందుకు సిద్ధంగా ఉండండి! Devara Frenzy కౌంట్ డౌన్ షురూ” అంటూ అదిరిపోయే పోస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందులో ఎన్టీఆర్ రెండు చేతులలో ఆయుధాలు పట్టుకుని, నీళ్ల మధ్యలో రాయి మీద నిలబడి భీకరంగా కనిపిస్తున్నారు.
View this post on Instagram
రెండు భాగాలుగా ‘దేవర’ విడుదల
ఈ చిత్రంలో హీరోయిన్ గా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోను చిత్రబృందం విడుదల చేసింది. పూర్తిగా పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం చాలా కష్టపడింది. స్పెషల్ వర్క్ షాప్ లోనూ పాల్గొంది. ఈ మూవీతో హిట్ కొట్టి సౌత్ లో పాగా వేయాలని ఆమె భావిస్తోంది. ఇక విలన్ గా బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ కూడా విడుదల అయ్యింది. బైరా పాత్రలో అత్యంత భయంకరంగా కనిపించారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్నది. అందులో తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దేవర' చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Also: అనౌన్స్ మెంటే ఇలా ఉంటే మూవీ ఎలా ఉంటుందో - కమల్, మణిరత్నం టైటిల్ వీడియో అదుర్స్ అంతే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial