అన్వేషించండి

Thug Life Movie: అనౌన్స్‌మెంటే ఇలా ఉంటే మూవీ ఎలా ఉంటుందో - కమల్, మణిరత్నం టైటిల్ వీడియో అదుర్స్ అంతే!

కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘థగ్ లైఫ్‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌ మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

విశ్వనటుడు కమల్ హాసన్ తాజాగా ‘విక్రమ్’ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఆయన కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఈ చిత్రం ఒకటిగా నిలిచింది. ఈ మూవీ విడుదలైన అన్ని చోట్లా కనీవినీ ఎరుగని ఆదరణ దక్కించుకుంది. ఈ  సూపర్ హిట్ తర్వాత ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. తాజాగా శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.

అనౌన్స్ మెంట్ తో అదరగొట్టిన మణిరత్నం

కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. చాలా కాలం తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. రేపు కమల్ హాసన్ తన బర్త్ డే. ఈ సందర్భంగా  క్రేజీ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. కమల్ కెరీర్ లో 234వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా మూవీకి సంబంధించిన టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ అనౌన్స్‌ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మేవీకి ‘థగ్ లైఫ్’ అని పేరు పెట్టారు.

ఈ చిత్రంలో రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్‍స్టర్  కమల్ కనిపించబోతున్నారు. గ్లింప్స్ ఓపెనింగ్ లోనే “నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదిటిపై క్రిమినల్, గూండా, యాకూజా అని రాసినట్టు ఉన్నారు”  అంటూ మొదలు పెడతారు. కమల్ తలపై ఓ ముసుగు ఉంది. కొందరు  కమల్ ను చంపేదుకు దూసుకొస్తారు. వారందరినీ కమల్ మట్టుబెడతారు. సరికొత్త వేషధారణలో కమల్ అదుర్స్ అనిపించారు. ఈ వీడియోలోని యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ అనౌన్స్ మెంట్ వీడియోతో మూవీపై భారీగా అంచనాలు రేకెత్తిస్తున్నారు మేకర్స్.

ఈ చిత్రంలో నటిస్తున్న పలువురు నటీనటులు

ఈ సినిమాలో హీరోయిన్‍గా త్రిష హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటన కూడా చేసింది. అటు మలయాళ  హీరో దుల్కర్ సల్మాన్, తమిళ హీరో జయం రవి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.  ఈ చిత్రాన్ని కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్, రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.  

35 ఏండ్ల తర్వాత మళ్లీ సినిమా చేస్తున్న కమల్, మణిరత్నం

ఇక కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్‍లో ‘నాయకన్’ అనే సినిమా వచ్చింది. 1987లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగులో ఈ చిత్రం 'నాయకుడు' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 35 ఏండ్ల తర్వాత మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది.

Read Also: సోషల్ మీడియోలో రష్మిక వీడియో వైరల్, అమితాబ్ బచ్చన్ ఆగ్రహం, కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్ కొత్త అవతారం.. డెస్టినీ బాక్స్‌తో ఎలిమినేషన్ భయం! రెడ్‌ జోన్‌లో రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్ కొత్త అవతారం.. డెస్టినీ బాక్స్‌తో ఎలిమినేషన్ భయం! రెడ్‌ జోన్‌లో రోహిత్!
Jagadhatri Serial Today October 21: కాచీ జుట్టు కాల్చేసి పార్టీ ఆపడానికి ఆదిలక్ష్మీ ప్రయత్నం వృథా...దివ్యాంకకు గట్టిగా బుద్ది చెప్పిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కాచీ జుట్టు కాల్చేసి పార్టీ ఆపడానికి ఆదిలక్ష్మీ ప్రయత్నం వృథా...దివ్యాంకకు గట్టిగా బుద్ది చెప్పిన ధాత్రి
Fauzi Glimpse: ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్ 'ఫౌజీ' గ్లింప్స్‌లో ఏముంటుంది? రివీల్ చేసిన ప్రొడ్యూసర్
ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్ 'ఫౌజీ' గ్లింప్స్‌లో ఏముంటుంది? రివీల్ చేసిన ప్రొడ్యూసర్
Rag Mayur: 'గరివిడి లక్ష్మి' జీవితంలో అసలైన విలన్... సత్తిబాబుగా కుమ్మేసిన రాగ్ మయూర్
'గరివిడి లక్ష్మి' జీవితంలో అసలైన విలన్... సత్తిబాబుగా కుమ్మేసిన రాగ్ మయూర్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget