అన్వేషించండి

Rashmika Mandanna : సోషల్ మీడియోలో రష్మిక వీడియో వైరల్, అమితాబ్ బచ్చన్ ఆగ్రహం, కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్

Rashmika: హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై బిగ్ బీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Fake video of Rashmika Mandanna goes viral on internet: పెరుగుతున్న టెక్నాలజీతో లాభాలతో పాటు నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉంటున్నాయి. నిజమైన వీడియోలు, ఫోటోలు అని భ్రమపడేలా ఫేక్ ఫోటోలు, వీడియోలను (Deepfake Video) ఎడిట్ చేస్తున్నారు కొంత మంది కేటుగాళ్లు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ అందుబాటులోకి వచ్చాక, పరిస్థితి మరింత చేదాటినట్లు కనిపిస్తోంది. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను ఇష్టారీతిన ఎడిట్ చేస్తూ సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఏది నిజమైన వీడియోనో, ఏది ఫేక్ వీడియోనో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నకిలీవి నిజమని నమ్ముతున్నారు.  

సోషల్ మీడియాలో రష్మిక వీడియో వైరల్  

రీసెంట్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ ధరించి, లిఫ్టులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో రష్మిక ఎప్పుడూ లేనంతగా అందాలు ఆరబోస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అయ్యారు. రష్మిక ఇలా ఎక్స్ పోజ్ చేయడం ఏంటి? ఇలా తయారై బయటకు రావడం ఏంటి? అయినా, రష్మిక వీడియో ఏదో తేడాగా ఉందే? అని నెటిజన్లను అనుమానం వ్యక్తం చేశారు.   

ఫేక్ వీడియో కథ బయటపెట్టిన జర్నలిస్టు

చివరకు కొంత మంది ఇది ఫేక్ వీడియో అంటూ కామెంట్ పెట్టారు. కానీ, చూడ్డానికి నిజమైన వీడియో మాదిరిగానే కనిపించడంతో చాలా మంది రియల్ వీడియో అని భ్రమ పడ్డారు. చివరకు  అభిషేక్ అనే జర్నలిస్టు ఇది ఫేక్ వీడియో అంటూ ఆధారాలతో సహా రుజువు చేశారు. ఈ వీడియోలో ఉన్న అసలు రష్మిక కాదని ఆయన తేల్చేశారు. ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కు సంబంధించినదని వెల్లడించారు. ఆ వీడియోతో పాటు మార్ఫింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జారా వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసినట్లు వెల్లడించారు.  

కఠిన చర్యలు తీసుకోవాలన్న అమితాబ్

ఈ ఫేక్ వీడియోపై రష్మిక అభిమానులతో పాటు  నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఈ వీడియోపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. రష్మిక మాత్రం ఈ వీడియోపై  ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.   

రష్మిక మందన్నా ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తోంది. త్వరలో రణబీర్ తో కలిసి నటించిన ‘యానిమల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అటు ‘పుష్ప2’లోనూ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలతో పాటు మరో 4 సినిమాల్లోనూ నటిస్తోంది.  

Also Read: అందుకే రాహుల్‌ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - రతిక చెల్లి షాకింగ్ కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Akhil Akkineni : అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
Gundeninda Gudigantalu July 06 Episode:సుమతిని పెళ్లిచేసుకుంటానని చెప్పిన అరుణ్....గుడిలో మరోసారి బాలు,అరుణ్ మధ్య ఘర్షణ.
గుండెనిండా గుడిగంటలు: సుమతిని పెళ్లిచేసుకుంటానని చెప్పిన అరుణ్....గుడిలో మరోసారి బాలు,అరుణ్ మధ్య ఘర్షణ.
Illu Illalu Pillalu Serial Today July 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సుకన్య ప్రెగ్నెంట్..! బయట పడిపోయిన వల్లీ నాటకం! ఇంట్లో రచ్చ రచ్చ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: సుకన్య ప్రెగ్నెంట్..! బయట పడిపోయిన వల్లీ నాటకం! ఇంట్లో రచ్చ రచ్చ!
God Of War: తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Rains In AP and Telangana: నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్ ఆప్షన్
Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Embed widget