NTR Devara : దేవరలో ఎన్టీఆర్ లుక్‌పై ట్రోలింగ్స్ - DOP రత్నవేలు షాకింగ్ కామెంట్స్
DOP Rathnavelu Reaction : దేవరలో ఎన్టీఆర్ లుక్, DOPలపై ట్రోలింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో DOP రత్నవేలు రియాక్ట్ అయ్యారు.

Devera DOP Rathnavelu Reaction On Trollings About Devara NTR Looks : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర'. 2024లో రిలీజైన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకున్నా... ఎన్టీఆర్ లుక్స్, DOPపై ట్రోలింగ్ సాగింది. కొన్ని షాట్స్, స్క్రీన్ ప్రజెన్స్‌పై విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూ దేవర DOP రత్నవేలు రియాక్ట్ అయ్యారు.
అలా వద్దని చెప్పినా...
హీరోలను స్క్రీన్‌పై వారి ఇమేజ్‌కు తగ్గట్లుగా చూపించే విషయంలో సినిమాటోగ్రాఫర్‌కు కొన్ని సవాళ్లుంటాయని చెప్పారు రత్నవేలు. 'జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలను చిత్రీకరించే టైంలో ఫ్రేమ్‌లో కనిపించే ప్రతీ అంశం ఎఫెక్ట్ చూపుతుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్‌లో ఉండే నటులు వీరిని డామినేట్ చేసేలా పొడుగ్గా ఉండకూడదు. దేవర షూటింగ్ టైంలో ఎన్టీఆర్ చుట్టూ పొడవైన వారు వద్దని నేను చెప్పా.
ఒకవేళ హీరో కంటే బ్యాగ్రౌండ్‌లోని వ్యక్తులు ఎక్కువగా డామినేట్ చేస్తే ఆడియన్స్ దృష్టి మారిపోతుంది. అలాంటి టైంలో కెమెరామెన్ నిస్సహాయంగా ఉంటాడు. ముఖ్యంగా వైడ్ షాట్స్, టాప్ యాంగిల్ షాట్స్ సహజంగానే స్టార్ హీరోను చిన్నగా చూపించే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రతీ హీరోకు స్పెషల్ విజువల్ ట్రీట్మెంట్ అవసరం. కొన్నిసార్లు DOP కోరుకున్న విధంగా అన్ని అంశాలు అమలు కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో టెక్నికల్ టీంకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి.' అని అన్నారు.
Also Read : Aishwarya Rajesh : విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
1980ల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలో సాగే స్టోరీ దేవర. తీర గ్రామంలో జరిగే అక్రమాలను అడ్డుకుని, మాఫియాపై ఎదురు తిరిగి తన వారికి అండగా నిలిచే ఓ యోధుడి కథే దేవర. దేవర అదృశ్యం తర్వాత అతని వారసత్వం చుట్టూ సాగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా నటించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా... సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేశారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు కీలకపాత్రలు పోషించారు.
దేవర 2 ఉంటుందా?
దేవర క్లైమాక్స్‌లో సీక్వెల్‌పై హింట్ కాకుండా క్లారిటీనే ఇచ్చారు కొరటాల శివ. ఫస్ట్ పార్ట్‌లో కొన్ని క్వశ్చన్స్‌కు ఆన్సర్స్ ఇవ్వకుండా సస్పెన్స్ ఉంచి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా రిలీజై ఏడాది గడిచిన తర్వాత గతేడాది సీక్వెల్ ఉంటుంది అంటూ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే, ఇది మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి దేవర 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ బాలయ్యతో మూవీ తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీస్‌తో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తైన తర్వాతే దేవరపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read : Romantic Movies : మీకు కొత్తగా పెళ్లైందా? - ఈ మూవీస్ డోంట్ మిస్
ట్రెండింగ్ వార్తలు























