అన్వేషించండి

Romantic Movies : మీకు కొత్తగా పెళ్లైందా? - ఈ మూవీస్ డోంట్ మిస్

Newly Couple Movies : యువ జంట కొంగొత్త ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. నూతన జంట మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 10 మూవీస్ ఓసారి చూస్తే...

New Wedding Couple Must Watch Top Ten Movies List : పెళ్లంటే... నూరేళ్ల పంట. ఒకరినొకరు అర్థం చేసుకుని మూడు ముళ్ల బంధంతో ఒక్కటై ఏడడుగులు వేసి జీవితాంతం తోడు నీడగా ఉంటామని అగ్నిసాక్షిగా ఒకరికొకరు చేసుకునే ప్రమాణం. పెళ్లికి ముందు పెళ్లైన తర్వాత కొత్త దంపతులకు పూర్తి అవగాహన అవసరం. పెళ్లైన తర్వాత ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి... ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అనే కాన్సెప్ట్‌పై కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఓ రకంగా ఇది కొత్త దంపతులకు కౌన్సిలింగ్ అనే చెప్పాలి. అలాంటి టాప్ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...

పెళ్లైన కొత్తలో - జగపతి బాబు, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కొత్త దంపతులు కచ్చితంగా చూడాలి. ఈ స్టోరీ భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థలు, సర్దుబాట్లు, అమాయక ప్రేమ, చిలిపి సరదాల చుట్టూ అద్భుతంగా సాగుతుంది. అప్పటి జనరేషన్‌లో బంధాలు ఎందుకు అంత బలంగా ఉండేవో కూడా చూపించారు డైరెక్టర్ మదన్. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆస్తా సింఘాల్, ఆహుతి ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని sunNXT ఓటీటీలో చూడొచ్చు.

మజిలీ - నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ భార్యభర్తల మధ్య ఉండే బాండింగ్, లవ్, ఒకరి కోసం ఒకరు చేసిన త్యాగం చక్కగా ఎమోషనల్‌గా చూపించారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ sunNXT, Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

మనసంతా నువ్వే - ఉదయ్ కిరణ్, రీమాసేన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ. లవర్స్ మధ్య చిన్న చిన్న అపార్థాలు తొలిగించేలా కౌన్సిలింగ్ పాత్ర ఎంత ముఖ్యమో ఈ మూవీలో చూడొచ్చు. వీఎన్ ఆదిత్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం sunNXT, Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆరెంజ్ - రామ్ చరణ్, జెనీలియా లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా ప్రేమలోని అర్థాలు, బాధ్యతలను, రిలేషన్ షిప్‌లో ఉండాల్సిన అవగాహన తెలియజేస్తుంది. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సినిమా Youtubeలో అందుబాటులో ఉంది.

బొమ్మరిల్లు - సిద్దార్థ్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేమ, పెళ్లికి ముందు పిల్లల భావాలు, పేరెంట్స్ అతి జోక్యం వల్ల కలిగే అనర్థాలు, ఫ్యామిలీ మెంబర్స్‌తో సర్దుకుపోవడం, కొత్త జంటకు కౌన్సిలింగ్ అనే థీమ్‌తో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. భాస్కర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం Youtubeలో మూవీ చూడొచ్చు.

Also Read : Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

హ్యాపీ - అల్లు అర్జున్, జెనీలియా జంటగా నటించిన ఈ మూవీ ప్రేమ, పెళ్లి, బాధ్యతల మధ్య ఇరుక్కునే ఓ యంగ్ కపుల్ ఆలోచనలను చూపిస్తుంది. లవ్‌తో పాటు బాధ్యత వంటి అంశాలను కూడా చూపించారు. ఈ సినిమాను sunNXTలో చూడొచ్చు.

ఖుషి - పవన్ కల్యాణ్, భూమికల క్లాసిక్ లవ్ స్టోరీ. సినిమాలో లవర్స్, భార్యాభర్తల మధ్య ఈగో ఎలాంటి క్లాషెష్ క్రియేట్ చేస్తుంది... దాన్ని ప్రేమతో ఎలా జయించవచ్చు అనేది చూపించారు. ఈ సినిమాను Amazon Prime Videoలో చూడొచ్చు.

మురారి - మహేశ్ బాబు, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో డివోషనల్ టచ్‌తో పాటు ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్, లవ్, సంప్రదాయాలు, కుటుంబ విలువలు వంటి వాటిని చక్కగా చూపించారు. ఈ మూవీ sunNXTలో ఉంది.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - విక్టరీ వెంకటేశ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో కుటుంబ బంధాలు, ఉమ్మడి కుటుంబాల వల్ల బలపడే బంధాలు, లవ్, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ చూపించారు. కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు కచ్చితంగా ఈ మూవీ చూడాలి. ప్రముఖ ఓటీటీ ZEE5లో అందుబాటులో ఉంది.

ఖుషి - విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : Maa Inti Bangaram: సమంతకు లైన్ క్లియర్ చేసిన అఖిల్... బంగారం లాంటి ఛాన్స్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget