అన్వేషించండి

Deva Katta: ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది

Deva Katta On Dragon: ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా 'డ్రాగన్'. ఈ సినిమాకు దర్శకత్వంలో దేవ కట్టా కూడా ఓ చెయ్యి వెయ్యబోతున్నారని వార్తలు వచ్చాయి. వాటిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • క్లిక్స్ కోసం తప్పుడు వార్తలు వ్యాపిస్తున్నాయని కట్టా ఆవేదన చెందారు.
  • తన తదుపరి ప్రాజెక్టు రచన, ప్రీ-ప్రొడక్షన్ పనులలో నిమగ్నమయ్యారు.
  • రాజమౌళి - మహేష్ బాబు 'వారణాసి'కి కట్టా సంభాషణలు అందిస్తున్నారు.

దర్శకుడు దేవ కట్టా (Deva Katta)కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. విలక్షణ కథలు, సినిమాలతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ నేపథ్యంలో ప్రజలలో ఆలోచన రేకెత్తించే, అవగాహన కల్పించే సినిమాలు తీయడం ఆయన స్టైల్. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసేలా 'మయసభ' వెబ్ సిరీస్ తీసి ఓటీటీలో భారీ హిట్ కొట్టారు. ఆ తర్వాత మరొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. అయితే కొన్ని రోజులుగా ఆయన నెక్స్ట్ సినిమా గురించి సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. సదరు పుకార్లపై ఆయన స్పందించారు. వాటిపై క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్ 'డ్రాగన్'కు దేవ కట్టా డైరెక్షన్.... 
దేవ కట్టా మీద వచ్చిన రూమర్లు ఏమిటి?
ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'డ్రాగన్'. దీనికి దేవ కట్టా డైలాగులు రాస్తున్నారని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి 'డ్రాగన్' సినిమాలో కొన్ని కీలకమైన ఘట్టాలకు దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు.

Also Read: Dragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌ డీకోడెడ్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్, హిడెన్ డీటెయిల్స్ గమనించారా?

ఎన్టీఆర్ 'డ్రాగన్'కు దేవ కట్టా ఘోస్ట్ డైరెక్షన్ చేస్తున్నాని మాత్రమే కాదు... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా దేవ కట్టా సినిమా చేయనున్నారని కూడా మరో ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. ఈ ప్రచారాలకు ఆయన చెక్ పెట్టారు.

అవన్నీ క్లిక్స్ కోసం చేసే పనులు...
దేవ కట్టా మీద రూమర్స్ ఎక్కువ అవ్వడంతో సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ చేశారు. దాంతో రూమర్లు అన్నిటికీ క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. వెబ్‌ సైట్లకు వచ్చే క్లిక్స్, వ్యూస్ కోసం అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని దేవ కట్టా ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరుల సినిమాలకు తాను ఒక్క షాట్ కూడా డైరెక్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి వార్తలను అభిమానులు అస్సలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దాంతో ఎన్టీఆర్ 'డ్రాగన్'కు దేవ కట్టా డైరెక్షన్ చేస్తున్నారని వచ్చిన వార్తలు ఫేక్ అని తేలింది. తన 'ఎక్స్' పోస్ట్ (ట్వీట్)లో 'డ్రాగన్' పేరును దేవ కట్టా ప్రస్తావించలేదు. కానీ, క్లారిటీ మాత్రం వచ్చింది.

Also Read: Deva Katta Interview - చంద్రబాబు Vs వైఎస్సార్ లైఫ్ స్టోరీ కాదు - 'మయసభ' సిరీస్‌పై డైరెక్టర్ దేవా కట్టాతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

ప్రస్తుతం తన దృష్టి అంతా త్వరలో చేయబోయే ప్రాజెక్ట్‌ మీద ఉందనిదేవ కట్టా తెలిపారు. ఆ సినిమాకు సంబంధించిన రైటింగ్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తన తదుపరి చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తానని ఆయన తెలిపారు. అయితే... సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో రూపొందుతున్న 'వారణాసి' సినిమాకు దేవ కట్టా డైలాగులు రాస్తున్నారని తెలిసింది. 'వారణాసి' టైటిల్ లాంచ్ ప్రోగ్రాంలో ఆయన కూడా హాజరైన సంగతి తెలిసిందే.

Also Read: Sing Geetham Review - 'సింగ్ గీతం' రివ్యూ: ఊరికి శాపం, మాటల బదులు పాటలు... సింగీతం సినిమా ఎలా ఉందంటే?

Frequently Asked Questions

ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారనే వార్తల్లో నిజమెంత?

దేవ కట్టా ఈ వార్తలను ఖండించారు. ఇతరుల సినిమాలకు తాను ఒక్క షాట్ కూడా డైరెక్ట్ చేయలేదని స్పష్టం చేశారు. ఆయన దృష్టి ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఉంది.

ప్రస్తుతం దేవ కట్టా దేనిపై దృష్టి సారించారు?

ప్రస్తుతం ఆయన దృష్టి అంతా త్వరలో చేయబోయే తన ప్రాజెక్ట్‌ మీద ఉందని తెలిపారు. ఆ సినిమాకు సంబంధించిన రైటింగ్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

మహేష్ బాబు - రాజమౌళి సినిమా 'వారణాసి'లో దేవ కట్టా పాత్ర ఏమిటి?

సూపర్ స్టార్ మహేష్ బాబు - రాజమౌళి కలయికలో రూపొందుతున్న 'వారణాసి' సినిమాకు దేవ కట్టా డైలాగులు రాస్తున్నారని తెలిసింది. ఆయన టైటిల్ లాంచ్ ప్రోగ్రాంలో కూడా హాజరయ్యారు.

టాప్ హెడ్ లైన్స్

Romantic Action Thriller OTT : చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
Comrade Kalyan Day 1 Collection : కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు సాలిడ్ నెంబర్స్
కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు సాలిడ్ నెంబర్స్
Peddi TV Premiere : టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!
టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget