అన్వేషించండి

Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Drishyam 3 OTT Platform : మలయాళ స్టార్ మోహన్ లాల్ రీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్‌ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Mohanlal's Drishyam 3 OTT Release Date : సూపర్ హిట్ సీక్వెల్, టాప్ ట్రెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే మనకు గుర్తొచ్చేది 'దృశ్యం'. తెలుగులో విక్టరీ వెంకటేశ్ నటించిన దృశ్యం, దృశ్యం 2 రెండూ హిట్‌గా నిలిచాయి. మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన మూవీస్‌కు ఇది రీమేక్. ఇటీవలే మోహన్ లాల్ దృశ్యం 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దీన్ని తెలుగులో రీమేక్ చేయలేదు కానీ డైరెక్ట్‌గానే రిలీజ్ చేశారు. మే 21న థియేటర్లలోకి వచ్చిన 'దృశ్యం 3' (Drishyam 3) మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా మంచి నెంబర్స్ సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.230 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

దృశ్యం 3 డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) సొంతం చేసుకోగా... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 18 నుంచి సినిమా అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన మూవీలో మోహన్ లాల్, మీనాలతో పాటు అన్సీబా హాసన్, ఎస్తర్ అనిల్, సిద్ధిఖీ, బిజూ మేనన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించగా... అనిల్ జాన్సన్ మ్యూజిక్ అందించారు.

Also Read : Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

స్టోరీ ఏంటంటే?

దృశ్యం 2 ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి దృశ్యం 3 కథ స్టార్ట్ అవుతుంది. హైకోర్టులో వరుణ్ మర్డర్ కేసును కొట్టేయడంతో జార్జ్ (మోహన్ లాల్) ఫ్యామిలీకి గొప్ప రిలీఫ్ దొరుకుతుంది. పాత చేదు జ్ఞాపకాలను మర్చిపోయి వారంతా హ్యాపీగా ఉంటారు. కొన్నాళ్లకు తమ కథనే దృశ్యం పేరుతో సినిమాగా తీసిన జార్జ్ నిర్మాతగా బిగ్ సక్సెస్ అందుకుంటాడు. ఇదే టైంలో పెద్ద కూతురు అంజు (అన్సీబా హాసన్) పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు.

అయితే, కుదిరిన ప్రతీ మ్యాచ్ కూడా లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అవుతుండడంతో జార్జ్‌లో అనుమానం స్టార్ట్ అవుతుంది. దీనిపై డెప్త్‌గా ఆరా తీస్తే కొందరు శత్రువులు తన కుమార్తె పెళ్లి కానీయకుండా చేయాలని... ఆపై ఆమెను జైలుకు పంపే ఉద్దేశంతో కుట్ర చేస్తున్నారని అర్థమవుతుంది. అసలు ఆ కుట్ర చేస్తుంది ఎవరు? దీనికి వరుణ్ ఫ్యామిలీకి ఏమైనా సంబంధం ఉందా? ఈ కుట్రను పోలీసులు ఎలా వాడుకున్నారు? ఈసారి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు జార్జ్ ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Kevin Kunta Dance : చికిరి చికిరి పాటకు కెవిన్ కుంట స్టెప్పులు - రామ్ చరణ్ బాడీగార్డ్ సిగ్నేచర్ షాట్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget