Kevin Kunta Dance : చికిరి చికిరి పాటకు కెవిన్ కుంట స్టెప్పులు - రామ్ చరణ్ బాడీగార్డ్ సిగ్నేచర్ షాట్
Chikiri Chikiri Song : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. పెద్దిలో చికిరి చికిరి పాటకు ఆయన స్టెప్పులేశారు.

Kevin Kunta Dance For Chikiri Chikiri Song : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.236.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు బాక్సాఫీస్ వద్ద పెద్ది మేనియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్ ఎంత ఫేమస్ అయ్యారో... ఆయన పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కూడా అంతే ఫేమస్ అయ్యారు.
చికిరి చికిరి పాటకు డ్యాన్స్
తాజాగా చరణ్ బాడీగార్డ్ సినిమాలో చికిరి చికిరి పాటకు స్టెప్పులు వేశారు. దీంతో పాటే క్రికెట్ సిగ్నేచర్ షాట్‌ను రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఇది స్పెషల్ వీడియో. ఇండియాలో సేకరించిన నిధులన్నింటికీ, పెద్ది చిత్రానికి అంకితం చేయబడింది.' అంటూ కెవిన్ తన ఇన్ స్టాలో ఈ వీడియో పోస్ట్ చేశారు.
View this post on Instagram
Also Read : Nag Ashwin : నేలపై కూర్చున్న నాగ్ అశ్విన్ - సినిమా కంటే తననే ప్రేమిస్తాడన్న సింగీతం... ఎమోషనల్ మూమెంట్స్
క్లీంకార క్యూట్ విషెష్
రామ్ చరణ్‌కు ఆయన కుమార్తె క్లీంకార క్యూట్ విషెష్ చెప్పారు. 'నాన్నా లవ్ యూ సోమచ్' అంటూ స్వీట్ వాయిస్‌తో విష్ చేశారు. దీంతో పాటే చికిరి చికిరి సాంగ్‌కు ఇంట్లో స్టాఫ్ కూడా డ్యాన్స్ చేశారు. క్లీంకార ఫస్ట్ వాయిస్ రివీల్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు చరణ్ భార్య ఉపాసన. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది. క్లీంకార పాప వాయిస్ సో క్యూట్ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన పెద్ది సినిమా థియేటర్లలో రికార్డుల వేట కొనసాగిస్తోంది. చరణ్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్, యాక్టింగ్, డ్యాన్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చరణ్‌కు కూతురు క్లీంకార… pic.twitter.com/OgCNu04gnF
— ABP Desam (@ABPDesam) June 7, 2026
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు























