Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Ramani Kalyanam OTT Platform : రీసెంట్ రొమాంటిక్ డ్రామా రమణి కల్యాణం ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

Surya Vashistta's Ramani Kalyanam OTT Release Date Locked : రీసెంట్ రొమాంటిక్ డ్రామా 3 వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. సూర్య వశిష్ట, దీప్షిఖా చంద్రన్ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా 'రమణి కల్యాణం' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
రమణి కల్యాణం మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్' (sunNXT)లో ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. సూర్య, దీప్షిఖాలతో పాటు శ్రీనివాసరెడ్డి, యాంకర్ శ్యామల, చైతూ జొన్నలగడ్డ తదితరులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లో నార్మల్ రెస్పాన్స్ అందుకున్న మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.
When the perfect match is the one who heals your soul.
— SUN NXT (@sunnxt) June 7, 2026
Stream Ramani Kalyanam on Sun NXT from 12 June!#RamaniKalyanam #TeluguMovies #TFI #SunNXT
[Feel Good Movies, Telugu Movies, New Telugu Movies, Deepshika, Surya Vashistta, Romance Movies, Emotional Drama, Poetic Movies,… pic.twitter.com/LL5Wa17mDS
Also Read : Kevin Kunta Dance : చికిరి చికిరి పాటకు కెవిన్ కుంట స్టెప్పులు - రామ్ చరణ్ బాడీగార్డ్ సిగ్నేచర్ షాట్
స్టోరీ ఏంటంటే?
చిన్నతనంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కుటుంబంతో పాటు కంటి చూపును కోల్పోతుంది సంజన (దీప్సిఖా చంద్రన్). అయితే, తనపై ఇతరులు సింపతీ చూపించడం తనకు నచ్చదు. చూపు లేకున్నా నిరుత్సాహపడకుండా తన బామ్మ, నలుగురు పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. పబ్‌లో సింగర్‌గా, ఆర్జేగానూ వర్క్ చేస్తుంది. అలాంటి ఆమెకు ఎప్పుడూ గతాన్ని తలుచుకుని బాధ పడే రాజ్ (సూర్య వశిష్ట) అనుకోకుండా పరిచయం అవుతాడు.
ఓ ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన రాజ్ వీల్ చైర్‌కే పరిచయం అయిన కుర్రాడు రాజ్. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. సంజన ఇన్‌స్పిరేషన్‌తో రాజ్ కొత్త లైఫ్ ప్రారంభించాలని అనుకుంటాడు. మరి రాజ్ అనుకున్నది జరిగిందా? వీరిద్దరూ ప్రేమలో పడితే పబ్ ఓనర్, రాజ్ ఫ్రెండ్ కిశోర్ (శ్రీనివాసరెడ్డి) టెన్షన్ పడతాడు. వీళ్లద్దరికి ప్రేమలో ఎదురైన కష్టాలేంటి? విలన్ ఎవరు? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ట్రెండింగ్ వార్తలు























