Daaku Maharaaj First Single: బాలయ్య ఫ్యాన్స్ రెడీనా... 'డాకు మహారాజ్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే?
Balakrishna Daaku Maharaaj: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌కు 'డాకు మహారాజ్' టీం గుడ్ న్యూస్ చెప్పింది. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) బ్రేక్ అనేది తీసుకోవడం లేదు. ఒక వైపు టాక్ షో... మరొక వైపు సినిమాలు... వరుస షూటింగులు చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2 తాండవం' చిత్రీకరణ బుధవారం ప్రారంభించారు. గురువారం 'డాక్ మహారాజ్' సినిమా అప్డేట్ ఇచ్చారు ఆ వివరాల్లోకి వెళితే...
'డాకు మహారాజ్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్!
బాలకృష్ణ కథానాయకుడిగా బాబి కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'డాకు మహారాజ్'. ఇందులోని మొదటి పాటను ఈ నెల 14వ తేదీన అంటే ఈ శనివారం విడుదల చేయనున్నట్లు ఇవాళ వెల్లడించారు. శుక్రవారం ఉదయం 10.08 గంటలకు ప్రోమో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
View this post on Instagram
'డాకు మహారాజ్' చిత్రానికి సంగీత సంచలనం ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాలకృష్ణతో ఆయనది సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరూ చేసిన సినిమాలు అన్నింటిలోకెల్లా 'అఖండ' సినిమాలో పాటలకు మరీ ముఖ్యంగా నేపద్య సంగీతానికి ప్రేక్షకుల నుంచి విపరీతమైన ప్రశంసలు లభించాయి. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 'అఖండ 2 తాండవం' చిత్రానికి కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి 'డాకు మహారాజ్'
Daaku Maharaaj Release Date: 'డాకు మహారాజ్' చిత్రాన్ని శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకు వస్తున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: హిందూ సాంప్రదాయంలో కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి... కొప్పున మల్లెలు, మోములో నవ్వులు
Daaku Maharaaj Movie Cast And Crew: 'డాకు మహారాజ్' సినిమాలో బాబీ డియోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు. 'అఖండ' తర్వాత బాలకృష్ణతో ప్రగ్యా జైస్వాల్ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. ఇందులో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. చాందినీ చౌదరి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
'డాకు మహారాజ్' సినిమాతో పాటు సంక్రాంతి బరిలో జనవరి 10న రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన 'గేమ్ చేంజర్'... జనవరి 14న వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అజిత్ తమిళ సినిమా 'విడా మయూర్చి' కూడా విడుదల కానుంది.
Also ReadAlso Read: ఇయర్ ఎండ్ రివ్యూ 2024: కల్కి, సలార్ to పుష్ప 2, దేవర... పిక్చర్ అభీ బాకీ హై ఆడియన్స్ - అసలు కథ సీక్వెల్‌లో ఉందండోయ్!





















