By: ABP Desam | Updated at : 21 Sep 2023 05:27 PM (IST)
Photo Credit : Director krishnavamsi/Twitter
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నకృష్ణవంశీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఒకప్పుడు. ఇండస్ట్రీలో ఎన్నో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. 'నిన్నే పెళ్ళాడతా', 'సింధూరం', 'అంతపురం', 'మురారి', 'ఖడ్గం' వంటి సినిమాలతో అగ్ర దర్శకుడుగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో సినిమాలు తీయడంలో కాస్త వెనకబడ్డారు. 2017లో 'నక్షత్రం' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కృష్ణవంశీ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది 'రంగమార్తాండ' సినిమాని తెరకెక్కించారు. బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ లాంటి అగ్ర నటీ నటులు నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా పెళ్లి, రమ్యకృష్ణతో విభేదాలపై కృష్ణవంశీ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి జీవితంలో అసలు పెళ్లి చేసుకోవద్దు అనుకున్నానని, అనుకోకుండా రమ్యకృష్ణ తన లైఫ్ లోకి వచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు కృష్ణవంశీ.
"పెళ్లి, పిల్లలు, బాధ్యత.. వీటన్నిటికీ నేను కంఫర్ట్ కాదు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఏకాకిగా కాదు, ఒంటరిగా ఉండడాన్ని మాత్రమే ఇష్టపడతాను. ఆ తర్వాత బాధ్యత అంటే చాలా భయం. ఒక ఫ్రీ సోల్ గా ఉండాలని అనుకొని పెళ్లి వద్దనుకున్నాను. ఆ తర్వాత అనుకోకుండా రమ్యకృష్ణ నా జీవితంలోకి వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంది" అని అన్నారు. రమ్యకృష్ణ మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయని? అడిగితే.. "ఎలాంటి మార్పులు రాలేదు. నన్ను అంత ఇబ్బంది పెట్టలేదు. ఇరుకున పెట్టలేదు. నన్ను నన్నుగా ఉండనిచ్చింది. తాను తనుగా ఉంది. మా పెళ్లి తర్వాత మా జీవితంలోకి మా కొడుకు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి మార్పులు లేవు" అని తెలిపారు.
డబ్బు కోసం మీరు రమ్యకృష్ణ పెళ్లి చేసుకున్నారని అలాగే పెళ్లి తర్వాత మీ ఇద్దరి మీద విభేదాలు వచ్చాయని రకరకాల వార్తలు రావడం పై కృష్ణవంశీ స్పందిస్తూ.. "సెలబ్రిటీలు అన్న తర్వాత అలాంటి వార్తలు రావడం సర్వసాధారణం. అందరూ అలా ఆలోచించరు. ఎవరో కొందరు ఇలాంటి వార్తలను సృష్టిస్తుంటారు. అవి విన్నప్పుడు మేం కూడా నవ్వుకుంటాం. అందుకే నేను కూడా ఈ విషయాలను ఎప్పుడూ ఖండించలేదు. అలాంటివి విన్నప్పుడు మన గురించి బయట అలా కూడా మాట్లాడుకుంటున్నారా అని అనుకుంటా. ఇకపోతే మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం" అంటూ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు కృష్ణవంశీ.
దీంతో ప్రస్తుతం కృష్ణవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా 'రంగమార్తాండ' సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన కృష్ణవంశీ తన తదుపరిచిత్రాన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.ఇక రమ్యకృష్ణ విషయానికొస్తే.. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ ల లోనూ నటిస్తున్నారు.
Also Read : 'దొరసాని' డైరెక్టర్ రెండో సినిమా - పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కుమారుడు హీరోగా
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?
Renu Desai : అంకుల్ మీకు ఇంత వయసొచ్చింది, ఇదేనా మీ అనుభవం - సీనియర్ జర్నలిస్టుపై రేణు దేశాయ్ ఆగ్రహం
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
/body>