అన్వేషించండి

Shah Rukh Khan: ఆ విషయాల్లో సౌత్ సినిమాలు అద్భుతం, బాలీవుడ్ బాద్ షా ప్రశంసల జల్లు!

సౌత్ సినిమాలపై షారుఖ్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. సినిమాటిక్ గా, టెక్నికల్ గా దక్షిణాది సినిమాలు అద్భుతంగా ఉంటాయన్నారు. లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌ లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Shahrukh Khan Praised South Indian Cinema: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ దక్షిణాది దర్శకులు సినిమాలపై ఓ రేంజిలో పొగడ్తల వర్షం కురిపించారు. గత కొంతకాలంగా సౌత్ సినిమాలు అద్భుతంగా రూపొందుతున్నాయంటూ అభినందించారు. మరోసారి నేరుగా దక్షిణాది సినిమాలో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టుకున్నారు. గత ఏడాది షారుఖ్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పఠాన్’, అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ సినిమాలు ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలో ఆయన సౌత్ సినిమా చేయాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌ లో షారుఖ్ కీలక వ్యాఖ్యలు

తాజాగా స్విట్జర్లాండ్ లో జరిగిన 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌ షారుఖ్ ఖాన్ పాల్గొన్నారు. ఆగష్టు 10న జరిగిన ఈ సినీ వేడుకలో ఆయను పార్డో అల్లా కారియేరా అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షారుఖ్, సౌత్ సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. "భారతీయ సినిమాలను ప్రాంతాలుగా విడదీయడం సరికాదు. భారతదేశం విశాలమైన దేశం. దేశవ్యాప్తంగా పలు భాషలు ఉన్నాయి. తమిళం, తెలుగు, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ సహా అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. తెలుగు, మలయాళం, తమిళ సినిమా పరిశ్రమలలో దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్లు ఉన్నారు. ఇటీవల ‘జవాన్’, ‘RRR’, ‘బాహుబలి’ లాంటి భారీ హిట్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు గమనించారు. సినిమా పరంగా, టెక్నికల్ గా కూడా సౌత్ ఇండియన్ సినిమాలు చాలా బాగున్నాయి. మణిరత్నంతో  ‘దిల్ సే’లో నటించిన తర్వాత మరోసారి సౌత్ సినిమా చేయాలి అనిపిస్తోంది” అని షారుఖ్ చెప్పుకొచ్చారు.

సౌత్ ఇండియన్ సినిమా సమ్ థింగ్ స్పెషల్- షారుఖ్

సౌత్ సినిమాలను తాను చాలా ఎంజాయ్ చేస్తానని షారుఖ్ వెల్లడించారు. “సౌత్ ఇండియన్ సినిమా అంటే సమ్ థింగ్ స్పెషల్. వారి హీరోలను చక్కగా చూపిస్తారు. సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే సౌత్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తాను” అని చెప్పుకొచ్చారు. అటు దర్శకుడు అట్లీని ప్రశంసిస్తూ షారుఖ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సౌత్ ఇండియన్ దర్శకుల చిత్రాలలో నటించడం ప్రారంభించినప్పుడు భాష సమస్యగా ఉండేది. కానీ, మేము సైగల ద్వారా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాం. అట్లీ గొప్ప డైరెక్టర్. మేం ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. కలిసి డ్యాన్స్ చేసే వాళ్లం. ఇష్టమైన ఫుడ్ కలిసి తినేవాళ్లం. ‘జవాన్’ సినిమా హిందీతో పాటు సౌత్ సినిమా మధ్య లింక్ పెట్టి అట్లీ తెరకెక్కించారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధించింది. ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచింది” అని షారుఖ్ చెప్పుకొచ్చారు.

అటు ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుజోష్ ఘోష్ తెరకెక్కించే ‘కింగ్’ చిత్రంలో తాను నటించబోతున్నట్లు చెప్పారు. అభిషేఖ్ బచ్చన్, సుహానా ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.  

Also Readమిస్టర్ బచ్చన్ వర్సెస్ డబుల్ ఇస్మార్ట్... రవితేజ కంటే రామ్ సినిమాకు ఎక్కువ క్రేజ్... బిజినెస్ కూడా ఎక్కువేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget