Mr Bachchan Vs Double Ismart: మిస్టర్ బచ్చన్ వర్సెస్ డబుల్ ఇస్మార్ట్... రవితేజ కంటే రామ్ సినిమాకు ఎక్కువ బిజినెస్?
Ravi Teja Vs Ram Pothineni: రవితేజ 'మిస్టర్ బచ్చన్', రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' ఒకే రోజు విడుదల అవుతున్నాయి. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఎవరి సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి? అంటే...

ఆగస్టు 15న మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) 'మిస్టర్ బచ్చన్', ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) 'డబుల్ ఇస్మార్ట్' థియేటర్లలోకి వస్తున్నాయి. అంటే... 'మిస్టర్ బచ్చన్' ప్రీమియర్లు ముందు రోజు (ఆగస్టు 14) రాత్రి వేస్తున్నారు. ఆల్రెడీ షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. నైజాంలో 'డబుల్ ఇస్మార్ట్' బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. బుకింగ్స్, కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే... ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...
రవితేజ కంటే రామ్ సినిమాకు ఎక్కువ డబ్బులు!
Pre Release Business Of Double Ismart And Mr Bachchan: 'మిస్టర్ బచ్చన్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 31 కోట్లు. 'డబుల్ ఇస్మార్ట్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 48 కోట్లు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. హిందీ సినిమా 'రైడ్' స్ఫూర్తితో, అందులోని పాయింట్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేసి 'మిస్టర్ బచ్చన్' తెరకెక్కించారు హరీష్ శంకర్. అందుకని, ఆ సినిమాను హిందీలో రిలీజ్ చేయడం లేదు. 'డబుల్ ఇస్మార్ట్'ను హిందీలోనూ విడుదల చేస్తున్నారు.
హిందీ రైట్స్ వరకు మినహాయించిన సరే... 'మిస్టర్ బచ్చన్' కంటే 'డబుల్ ఇస్మార్ట్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువ. రవితేజ లాస్ట్ ఫిలిమ్స్ కొన్ని థియేటర్ల దగ్గర ఆశించిన ఫలితాలు సాధించలేదు. అందుకని, తక్కువ రేటుకు సినిమాను అమ్మింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. పూరి జగన్నాథ్ లాస్ట్ సినిమా 'లైగర్' డిజాస్టర్ అయినా సరే 'డబుల్ ఇస్మార్ట్'కు మంచి బిజినెస్ జరగడానికి కారణం 'ఇస్మార్ట్ శంకర్' సినిమా బి, సి సెంటర్లు... ముఖ్యంగా నైజాం ఏరియాలో సాధించిన విజయం!
Also Read: 'కల్కి 2898 ఏడీ'... వచ్చే వారమే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి... అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
నైజాంలో ఓన్ రిలీజ్‌కు వెళ్తున్న ప్రైమ్ షో!
'డబుల్ ఇస్మార్ట్' ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరగడం వెనుక మరొక రీజన్ 'హనుమాన్' నిర్మాతలు నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య రెడ్డి. 'డబుల్ ఇస్మార్ట్' వరల్డ్ వైడ్ రైట్స్ వాళ్లకు చెందిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఆల్మోస్ట్ 60 కోట్ల రూపాయలకు తీసుకుంది. అందులో రూ. 54 కోట్లు అడ్వాన్స్, రూ. 6 కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ అని టాక్. 'హనుమాన్' విజయం సాధించడం, రామ్ అండ్ పూరి కాంబినేషన్ మీద నమ్మకంతో సినిమా తీసుకున్నారు. అయితే... ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మరి, ఏ సినిమాకు ఎన్ని కోట్లు వస్తాయో చూడాలి.
'మిస్టర్ బచ్చన్' విజయం సాధించడం రవితేజకు ఎంత ముఖ్యమో... దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar)కు సైతం అంటే ముఖ్యం. కరోనా, 'ఉస్తాద్ భగత్ సింగ్' ముందుకు వెనక్కి వెళ్లడం వల్ల ఆయనకు గ్యాప్ వచ్చింది. పూరి జగన్నాథ్ (Puri Jagannadh)కు 'లైగర్' డిజాస్టర్ నుంచి కోలుకోవడం కోసం 'డబుల్ ఇస్మార్ట్' హిట్ కావాలి.
Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూసేలా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

