Kalki 2898 AD OTT: 'కల్కి 2898 ఏడీ'... వచ్చే వారమే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి... అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
Kalki 2898 AD OTT Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందో తెలుసా? అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.
Kalki 2898 AD OTT Release Date: 'కల్కి 2898 ఏడీ' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు రెండు సంస్థలు సొంతం చేసుకున్నాయి. కేవలం హిందీ వెర్షన్ సైతం నెట్‌ఫ్లిక్స్ తీసుకోగా... సౌత్ లాంగ్వేజెస్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మరి, ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందో తెలుసా?
ఆగస్టు 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో...
Kalki 2898 AD Prime Video Release Date: 'కల్కి 2898 ఏడీ' సినిమా జూన్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. రూ. 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ బరిలో చరిత్ర సృష్టించింది. థియేటర్లలో విడుదలైన 45 రోజుల తర్వాత కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇప్పుడీ సినిమాను ఓటీటీలోకి తీసుకు రావడానికి రెడీ అయ్యింది అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.
Kalki 2898 AD OTT release date officially announced by Amazon Prime Video India: థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు 'కల్కి 2898 ఏడీ' ఓటీటీలోకి వస్తోంది. ఆగస్టు 23న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రజలు చూడవచ్చు. హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ, అది కూడా సేమ్ డే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూసేలా!
'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఖాతాలో...
Kalki 2898 AD collection worldwide total: రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ (Prabhas)లో భారీ విజయం అంటే 'బాహుబలి' అని చెప్పాలి. ఎందుకు అంటే... ఆ సినిమా ప్రపంచ ప్రేక్షకులకు ప్రభాస్‌ను దగ్గర చేసింది. ఇక, 'బాహుబలి 2' భారతీయ బాక్సాఫీస్ రికార్డులు చెరిపేసి... సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే... ఆ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి ఆ స్థాయి విజయం కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఆకలి తీర్చిన సినిమా 'కల్కి 2898 ఏడీ'.
ఇప్పటి వరకు 'కల్కి 2898 ఏడీ' సినిమా సుమారు 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓటీటీ విడుదలకు ఇంకా పది రోజుల సమయం ఉంది కనుక మరొక పది కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.
Kalki 2898 AD Cast And Crew: 'కల్కి 2898 ఏడీ'లో సుప్రీమ్ యస్మిన్ పాత్రలో లోక నాయకుడు కమల్ హాసన్, అశ్వత్థామగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకోన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, మృణాల్ ఠాకూర్, బ్రహ్మానందం, దుల్కర్ సల్మాన్, పశుపతి తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు 'కల్కి 2898 ఏడీ' ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా కంటే ముందు 'రాజా సాబ్' విడుదల కానుంది.