షారుఖ్ ఖాన్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలేంటో తెలుసా? షారుఖ్ పలు సూపర్ హిట్ సినిమాలు చేసే అవకాశం వచ్చినా కొన్ని కారణాలతో వదులుకున్నారు. 3 ఇడియట్స్: అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రాన్ని డేట్స్ అడ్జెస్ట్ చేయలేక వదులకున్నారు. స్లమ్‌డాగ్ మిలియనీర్: అనిల్ కపూర్ పాత్ర కోసం ఆఫర్ వచ్చినా క్యారెక్టర్ నచ్చలేదని వద్దనుకున్నారు. కహో నా ప్యార్ హై: తొలుత ఈ సినిమా హీరోగా షారుఖ్ కు అవకాశం వచ్చిన కొన్ని కారణాలతో చేయలేదు. మున్నాభాయ్ M.B.B.S: ఈ మూవీలో సంజయ్ దత్ రోల్ చేసే ఆఫర్ వచ్చినా ఆరోగ్యం బాగాలేక వదులకున్నారు. లగాన్: అమీర్ ఖాన్ ఫ్లేస్ లో ఫస్ట్ షారుఖ్ కే అవకాశం వచ్చినా కొన్ని కారణాలతో రిజెక్ట్ చేశారు. రోబో: రోబో హీరోగా చేయాలని శంకర్ షారుఖ్ ను కోరినా, సృజనాత్మక విభేదాలతో చేయలేదు. రంగ్ దే బసంతి: ఈ సినిమాలో అమీర్ ఖాన్ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చినా షారుఖ్ నో చెప్పారు. ఏక్ థా టైగర్: ‘జబ్ తక్ హై జాన్‘తో బిజీగా ఉండటంతో SRK ఈ సినిమాను వదులుకున్నారు. జోధా అక్బర్: ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా వ్యక్తిగత కారణాలతో షారుఖ్ తిరస్కరించారు.