దుబాయ్ వెకేషన్ లో రౌడీ హీరో- రష్మిక ఎక్కడంటున్న ఫ్యాన్స్? టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎడారిలో కార్ రైడింగ్ చేస్తూ సరదగా గడుపుతున్నాడు. ఈ టూర్ కు తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెళ్లాడు. వారితో కలిసి ఎడారి దేశంలో జాలీగా గడుపుతున్నాడు. దుబాయ్ షేక్ గెటప్ లో విజయ్ ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇసుకను తొక్కుతూ ట్రెడ్ మిల్ గా ఫీలవుతున్నట్లు చెప్పాడు. షర్ట్ తీసేసి మరీ ఫన్నీ చేష్టలు చేస్తున్నాడు. పనిలో పనిగా ఈ టూర్ కు రష్మిక మందన్నను కూడా వెంట తీసుకెళ్లాడట! దుబాయ్ ఎడారిలో విజయ్ సరదాలు- వీడియో మీరూ చూసేయండి. Photos & Video Credit: Vijay Deverakonda/Instagram