నాని కొత్త సినిమా నేడు పూజతో మొదలు అయ్యింది. హీరోగా నానికి 30వ సినిమా ఇది. నాని 30లో మృణాల్ ఠాకూర్ కథానాయిక. 'సీతా రామం' తర్వాత తెలుగులో ఆమెకు రెండో చిత్రమిది. నాని 30 ప్రారంభోత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన క్లాప్ ఇచ్చారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి ఐదుగురు దర్శకులు గౌరవ దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి, వశిష్ఠ మల్లిడి, వివేక్ ఆత్రేయ, కిశోర్ తిరుమల, బుచ్చి బాబు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డా విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి నాని 30 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. (All Image Courtesy : Vyra Entertainments)