కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి ప్రేమలో ఉండి తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ముంబైలో ఇద్దరూ చాలా సింపుల్‌గా వీరి వివాహం జరిగింది. కేఎల్ రాహుల్, అతియా వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని రోజుల తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి దాదాపు మూడు వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, గౌతమ్ గంభీర్, వరుణ్ ఆరోన్ వీరి వివాహానికి హాజరయ్యారు. న్యూజిలాండ్ సిరీస్ కారణంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు హాజరు కాలేదు.