బాలీవుడ్ హీరోయిన్లలో ఫ్యాషన్ టేస్ట్ ఉన్న హీరోయిన్లలో కృతి సనన్ ముందుంటుంది. బ్లూ కలర్ అవుట్ ఫిట్‌లో అదిరిపోయే ఫొటోలను కృతి షేర్ చేశారు. ఈ ఫొటోకు ఇప్పటివరకు ఎనిమిది లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం కృతి సనన్ క్రేజీ ప్రాజెక్టులతో కళకళలాడుతోంది. ఇటీవలే ‘భేడియా’తో భారీ హిట్ కూడా అందుకుంది. అల వైకుంఠపురములో రీమేక్ ‘షెహజాదా’లో కూడా హీరోయిన్‌గా నటించింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. దేశంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ‘ఆదిపురుష్’లో కూడా కృతినే హీరోయిన్. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. దీంతో పాటు టైగర్ ష్రాఫ్ సరసన గణపథ్ సినిమాలో కూడా నటిస్తుంది.