సన్నీ లియోన్ పేరు వింటే ప్రేక్షకులకు గ్లామరస్ హీరోయిన్ గుర్తుకు వస్తుంది. శృంగార తారగా పేరు పొందిన సన్నీ ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు. 'కొటేషన్ గ్యాంగ్' సినిమా కోసం సన్నీ లియోన్, ఇదిగో ఈ విధమైన డీ గ్లామర్ లుక్ లోకి మారిపోయారు. 'కొటేషన్ గ్యాంగ్' షూటింగ్ చేస్తున్నప్పుడు సన్నీకి గాయాలు అయ్యాయి. కాలి బొటన వేలుకు దెబ్బ తగిలింది. తనకు దెబ్బ తగిలినప్పుడు వీడియో తీసుకున్న సన్నీ లియోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రక్తం రావడంతో ఆ నొప్పి భరించలేక సన్నీ లియోన్ విలవిలాడారు. ఓ క్షణంలో సన్నీ లియోన్ ఏడ్చారు కూడా! ఆమె కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా 'కొటేషన్ గ్యాంగ్' రూపొందుతోంది. సన్నీ లియోన్ (Image Courtesy : Sunny Leone Instagram)