అన్వేషించండి

Allu Arjun Chiranjeevi: చిరంజీవి, బన్నీని ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్న బాలకృష్ణ - మెగా వర్సెస్ అల్లు గొడవకు ఫుల్ స్టాప్?

Nandamuri Balakrishna's Golden Jubilee Celebrations: సెప్టెంబర్ 1న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఆ వేదిక మీద చిరంజీవి, బన్నీ కలిసే అవకాశాలు ఉన్నాయట.

మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ మధ్య సత్సంబంధాలు లేవని జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్క వేదిక మీదకు రావడం అనేది ఆసక్తి కలిగించే అంశమే కదా! వాళ్లిద్దరూ ఒకే చోట సందడి చేసే అవకాశం కుదరడానికి కారణం గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ.

బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబరాలు... బన్నీకి ఆహ్వానం
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ ప్రవేశించి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న టాలీవుడ్ ఇండస్ట్రీ భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది. హైదరాబాద్ సిటీలోని హైటెక్స్ నోవోటెల్ హోటల్‌లో తెలుగు చిత్రసీమ ఆధ్వర్యంలో గ్రాండ్  సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా బన్నీని కలిసి ఆహ్వానం అందించారు.
Allu Arjun Chiranjeevi: చిరంజీవి, బన్నీని ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్న బాలకృష్ణ - మెగా వర్సెస్ అల్లు గొడవకు ఫుల్ స్టాప్?

బాలకృష్ణ, బన్నీ మధ్య మంచి అనుబంధం ఉంది. అందువల్ల, తాను తప్పకుండా ఈ కార్యక్రమానికి వస్తానని ఐకాన్ స్టార్ చెప్పారట. దాంతో మేనమామ చిరంజీవితో కలిసి ఒకే వేదిక మీద సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.

బాలకృష్ణ కోసం వేడుకకు వస్తున్న మెగాస్టార్ చిరంజీవి!
సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కనుక ఇండస్ట్రీలో ఆయన తరం హీరోలతో పాటు సీనియర్లు, జూనియర్లను సైతం ఆహ్వానిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఆల్రెడీ కలిశారు. ఆయనకు ఆహ్వానం అందించారు. ఈ వేడుకకు తాను తప్పకుండా వస్తానని చిరు సైతం హామీ ఇచ్చారట.
Allu Arjun Chiranjeevi: చిరంజీవి, బన్నీని ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్న బాలకృష్ణ - మెగా వర్సెస్ అల్లు గొడవకు ఫుల్ స్టాప్?

మెగా ఫ్యామిలీ గొడవలకు బాలకృష్ణ వేడుకకు ఫుల్ స్టాప్ పడుతుందా?
నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడం కొందరికి నచ్చలేదు. వైసీపీకి వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుంటే... స్నేహితుడి కోసం అంటూ బన్నీ వెళ్లడాన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేదు. సోషల్ మీడియా వేదికగా అతడి మీద విమర్శలు చేశారు. 

'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ వేడుకలో 'తనకు ఇష్టమైతే, నచ్చితే వస్తా' అంటూ బన్నీ కామెంట్ చేయడం ఆ విమర్శలకు ఇన్ డైరెక్ట్ కౌంటర్ అని పలువురు భావించారు. ఆ తర్వాత 'నువ్వు పుడింగివా' అంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి కామెంట్ చేయడం, బన్నీతో తమ పార్టీకి శత్రుత్వం లేదని చెప్పడం తెలిసిన విషయాలే.

Also Readసరిపోదా శనివారం రివ్యూ: నాని మాస్ హీరోయిజం వర్సెస్ ఎస్.జె. సూర్య విలనిజం - సినిమా ఎలా ఉందంటే?


మెగా అభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీ మధ్య సోషల్ మీడియాలో ఉప్పు నిప్పు అన్నట్టు ఉంది పరిస్థితి. కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని ఫిల్మ్ ఇండస్ట్రీలో జనాలు సైతం ఆఫ్ ది రికార్డ్ కామెంట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కుటుంబం అంతా కలిస్తే సెట్ అవుతుందని, అన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుందని బన్నీ వాస్ సైతం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం... చిరంజీవి, బన్నీ ఒక్క వేదికకు వచ్చే అవకాశాలు ఉండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరిలో ఆసక్తి నెలకొంది. ఏపీ ఎన్నికల తర్వాత చిరు, బన్నీ పబ్లిక్ స్టేజి మీద ఒక్కటిగా కనిపించలేదు. మరి, ఈ వేడుకలో కనిపిస్తారా? వెయిట్ అండ్ సి.

Also Readఅన్నయ్యా... అన్నయ్యా... అన్నయ్యా... నీది మాములు విలనిజం కాదన్నయ్యా... ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌

టాప్ హెడ్ లైన్స్

DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget