Chinmayi Sripada: దయచేసి మళ్లీ మనుషుల వైపు రాకు, పూనమ్ మృతిపై సింగర్ చిన్మయి ఎమోషనల్ పోస్టు
Chinmayi Sripada: నటి, మోడల్ పూనమ్ పాండే మృతి పట్ల సింగర్ చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.
Chinmayi Sripada About Poonam Pandey Dismiss: ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణించారంటూ.. ఆమె సోషల్ మీడియా సిబ్బంది ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. దీంతో అంతా షాకయ్యారు. ఆమె గర్భాశయ క్యాన్సర్ తో ఆమె చనిపోయినట్లు పీఆర్ టీమ్ వెల్లడించింది. యూపీలోని తన నివాసంలో చనిపోయినట్లు ప్రకటించింది. ఆమె అంత్యక్రియలు కూడా అక్కడే జరుగుతాయని తెలిపింది. ఆమె మరణం పట్ల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
పూనమ్ మృతి పట్ల చిన్మయి ఆవేదన
పూనమ్ పాండే మృతి పట్ల సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. చిన్న వయసులో చనిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ఆమె ఇంకా జీవించే అవకాశం ఉన్నా, నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని చెప్పుకొచ్చింది. ప్రజలు తనను విమర్శించినా, తనను తాను ఎక్కడా తక్కువ చేసుకోలేదని వెల్లడించింది. “పూనమ్ పాండే జీవించిన విధానం కారణంగా చాలా విమర్శలకు గురయ్యింది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు జీవించాలని, తమను తాము నమ్ముకోవాలని, తన గురించి వినిపించే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించింది. ఆమె మరణం కారణంగా గర్భాశయ క్యాన్సర్ పై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆమె ప్రయాణం ఈ భూమ్మీదుగా కొనసాగినందుకు ధన్యవాదాలు. మీరు పునర్జన్మ పొందాలి అనుకుంటే, మనుషులకు వైపు మాత్రం రావద్దు. ఇంకా మంచి జీవితానికి నువ్వు అర్హురాలివి” అని రాసుకొచ్చింది.
Poonam Pandey was highly criticised, to state it politely, for the way she lived. She showed us to live unabashedly, believe in herself, she exposed the hypocrisy in our fake~puritan drama, and in her passing, the star child she is, has created such an awareness for HPV cancer,…
— Chinmayi Sripaada (@Chinmayi) February 2, 2024
పూనమ్ మృతి పట్ల అనుమానాలు?
అటు పూనమ్ మృతి పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా సెలబ్రిటీ చనిపోతే, సినీ ప్రముఖులు, బంధుమిత్రులు వెళ్లడం కామన్. కానీ, పూనమ్ నివాసం దగ్గర ఎలాంటి హడావిడి లేదు. ఆమె మరణం గురించి సోషల్ మీడియాలో మినహా బయట ఎవరూ మాట్లాడ్డం లేదు. ఒకవేళ పూనమ్ నిజంగానే చనిపోతే, ఆమె మృతదేహం ఎక్కడుంది? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి పూనమ్ మొన్నటి వరకు బాగానే కనిపించింది. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఒకవేళ నిజంగానే ఆమెకు గర్భాశయ క్యాన్సర్ సోకితే, ఎక్కడ చికిత్స తీసుకుంది? ఈ వ్యాధి సోకితే హఠాత్తుగా చనిపోతారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె కుటుంబ సభ్యులు సైతం పూనమ్ మృతి వ్యవహారంలో సైలెంట్ గా ఉన్నారు. ఆమె తల్లి, సోదరి సైతం అందుబాటులో లేకపోవడం అనుమానాలు కలిగిస్తోంది. పూనమ్ నిజంగానే చనిపోయిందా? లేక పబ్లిసిటీ కోసం ఇలాంటి డ్రామా ఆడుతుందా? అనే చర్చ జరుగుతోంది.
Read Also: అలిపిరిలో ధనుష్ మూవీ షూటింగ్ క్యాన్సిల్ కాలేదట, అసలు విషయం చెప్పిన మేకర్స్!