శర్వానంద్ సినిమాలో యాంగ్రీ మ్యాన్ - ఫస్ట్ టైం అలాంటి పాత్రలో కనిపించనున్న సీనియర్ హీరో!
Sharwanand : సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ యంగ్ హీరో శర్వానంద్ కి తండ్రిగా కనిపించబోతున్నారట.
Veteran actor set to play Sharwanand’s father : టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ కి సరైన హిట్ పడి చాలా కాలమే అవుతోంది. ఈ మధ్యకాలంలో శర్వానంద్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. 'మహానుభావుడు', 'శతమానంభవతి' తర్వాత శర్వాకి మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు. వీటి తర్వాత వచ్చిన సినిమాలన్నీ బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ అయ్యాయి. శర్వానంద్ చివరగా నటించిన 'ఒకే ఒక జీవితం' పర్వాలేదు అనిపించింది.
అయితే ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా శర్వానంద్ ఇప్పటికే మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు కమిట్ అయ్యాడు. అందులో 'లూజర్' సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డితో ఓ పిరియాడిక్ ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నాడు. ఈ మూవీలో శర్వానంద్ తండ్రి పాత్రలో ఓ సీనియర్ హీరో నటిస్తున్నట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది.
శర్వానంద్ కి తండ్రిగా యాంగ్రీ మ్యాన్
'లూజర్' అనే వెబ్ సిరీస్ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిలాష్ రెడ్డితో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో శర్వానంద్ తండ్రిగా సీనియర్ హీరో, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటిస్తున్నారట. రాజశేఖర్ ఇప్పటివరకు ఇతర హీరోలకు తండ్రిగా నటించింది లేదు. రీసెంట్ గా నితిన్ హీరోగా నటించిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్'లో కీలక పాత్ర పోషించారు. అందులో ఓ పోలీస్ ఆఫీసర్ గా అలరించారు. ఇక ఇప్పుడు మొదటిసారి శర్వానంద్‌కు తండ్రిగా కనిపించబోతున్నాడు. ఇందులో రాజశేఖర్ రెండు రకాల వేరియేషన్స్ లో కనిపిస్తారని టాక్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో శర్వానంద్ కి జోడిగా మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. శర్వానంద్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
శర్వానంద్ మూవీ టైటిల్ 'మనమే'
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమాకి 'మనమే' అనే టైటిల్ ని మూవీ టీం ఫిక్స్ చేసినట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. శర్వానంద్ కెరియర్లో 35వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మొదట 'బేబీ ఆన్ బోర్డ్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఆ టైటిల్ పెడితే ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ అవ్వదని భావించిన మూవీ టీమ్ 'మనమే' అనే సింపుల్ టైటిల్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.
'సామజవరగమన' డైరెక్టర్ తో సినిమా
శ్రీవిష్ణు హీరోగా గత ఏడాది విడుదలైన 'సామజవరగమన' సినిమా థియేటర్స్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. శ్రీవిష్ణు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర రూ.50కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ సక్సెస్ తో దర్శకుడిగా రామ్ అబ్బరాజుకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రామ్ అబ్బరాజు తన తదుపరి చిత్రాన్ని యంగ్ హీరో శర్వానంద్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం.
Also Read : బాబాయ్ సినిమాతో పోటీ లేదు - క్రిస్మస్‌కి అబ్బాయ్ సినిమా