అన్వేషించండి

Catherine Tresa: అమెరికాలో కేథరిన్ పుట్టినరోజు వేడుకలు... అదీ తెలుగు సినిమా సెట్స్‌లో, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరంటే?

Catherine Tresa Birthday: కేథ‌రీన్ త‌న పుట్టిన రోజున ఘ‌నంగా జ‌రుపుకున్నారు. సినిమా సెట్స్‌లో త‌న అప్ క‌మింగ్ మూవీ టీంతో ఆమె సెల‌బ్రేట్ చేసుకున్నారు. స్పెషల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్.

అందం, అభినయంతో ఎంతో మంది కుర్ర‌కారు మ‌న‌సు దోచుకున్న టాలీవుడ్ బ్యూటీ కేథ‌రీన్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ అమెరికాలో ఘ‌నంగా జ‌రిగాయి. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ప్ర‌స్తుతం ఆమె సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్‌లో యూనిట్ స‌భ్యులు ఆమె బ‌ర్త్ డేని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆమె పుట్టిన రోజు సంద‌ర్భంగా త‌న అప్ క‌మింగ్ సినిమాకు సంబంధించి పోస్ట‌ర్ రిలీజ్ చేసింది సినిమా టీమ్.


వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో...

టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలను తెర‌కెక్కించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వీఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో కేథ‌రీన్ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. స‌రికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ సమర్పణలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా కీలక పాత్రలో న‌టిస్తుండ‌గా... చాలా మంది సీనియ‌ర్ న‌టీన‌టులు కూడా ఉన్నారు. సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయ‌లేదు మేక‌ర్స్. మంగ‌ళ‌వారం కేథరీన్ ట్రెసా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు స్పెష‌ల్ విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కేథరీన్ ట్రెసా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.

షూటింగ్ మొత్తం అమెరికాలోనే... 

స‌రికొత్త క‌థ‌తో, డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నామ‌ని మేక‌ర్స్ చెప్పారు. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో స్ట్రాంగ్ కంటెంట్ తో ఈ సినిమాను దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఇత‌ర దేశాల‌కు చెందిన కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అమెరికన్స్‌, స్పానిష్‌ పీపుల్‌, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్‌, ఏషియన్స్‌, తమిళ్‌, కన్నడ, తెలుగు ఆర్టిస్టులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను అమెరికాలోని డల్లాస్‌లో చిత్రీకరిస్తారు. సినిమా మొత్తం దాదాపు యూఎస్ లోనే షూట్ చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇక త్వరలో ఈ థ్రిల్లర్ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామ‌ని అన్నారు. 

కాస్ట్ అండ్ క్రూ.. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కేథరీన్ ట్రెసా కాగా.. ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్  బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఏయు & ఏఐ స‌మ‌ర్పిస్తుంగ‌డా.. మీనాక్షి అనిపిండి ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పద్మావతి మల్లాది ర‌చ‌యిత కాగా.. స్క్రీన్ ప్లే, దర్శకత్వం డాక్టర్ వీఎన్ ఆదిత్య. 

Also Read: 'ఎమ‌ర్జెన్సీ' సినిమా రిలీజ్ క‌ష్టాలు... కాంట్ర‌వ‌ర్షియల్ బంగ్లా అమ్మేసిన కంగ‌నా ర‌నౌత్?

బిజీ బిజీగా కేథ‌రిన్.. 

ఇక ప్ర‌స్తుతం ఈ సినిమాలో న‌టిస్తున్న కేథ‌రిన్ వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వీఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో యూఎస్ లో షూట్ లో ఉన్నారు. దాంతో పాటుగా ఒక త‌మిళ సినిమాకి ఆమె సైన్ చేశారు. ఆ సినిమా షూట్ దాదాపు 50 శాతం అయిపోయింది. ఆ త‌ర్వాత మ‌రో రెండు సినిమాలు సైన్ చేశార‌ట కేథ‌రిన్. అలా వ‌రుస సినిమాల‌తో ఆమె బిజీబిజీగా గ‌డుపుతున్నారు. 

Also Read: బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కాజల్... రష్మికతో పాటు చందమామ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Embed widget