అన్వేషించండి

Kangana Ranaut: 'ఎమ‌ర్జెన్సీ' సినిమా రిలీజ్ క‌ష్టాలు... కాంట్ర‌వ‌ర్షియల్ బంగ్లా అమ్మేసిన కంగ‌నా ర‌నౌత్?

Kangana Ranaut Bungalow: బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి, ఎంపీ కంగ‌నా ర‌నౌత్ ముంబైలోని త‌న బంగ్లాని అమ్మేశార‌ట‌. 'ఎమ‌ర్జెన్సీ' సినిమా కోసం ఆమె త‌న బంగ్లాను అమ్మేశార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి, ఎంపీ కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut) ముంబైలోని బాంద్రాలో గల త‌న ఇంటిని అమ్మేశార‌ట‌. 'ఎమ‌ర్జెన్సీ' సినిమా కోసం ఆమె ఈ ప‌ని చేసిన‌ట్లు బాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ముంబైలోని బాంద్రా ప‌లీహిల్ లో ఉన్న త‌న ప్రాప‌ర్టీని రూ. 32 కోట్ల‌కు అమ్మిన‌ట్లు తెలుస్తోంది. ఆ బంగ్లాను కంగ‌నా ర‌నౌత్ 2017 సెప్టెంబ‌ర్ లో రూ. 20.7 కోట్ల‌కు కొనుగోలు చేశారు. దాని మీద 2022 డిసెంబ‌ర్ లో లోన్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఆఫీసును ఆ బంగ్లాలోనే నిర్వ‌హిస్తున్నారు కంగ‌నా. ఇప్పుడు ఆ బంగ్లానే ఆమె అమ్మేసిన‌ట్లు తెలుస్తోంది. 

యూట్యూబ్ ఛాన‌ల్ లో యాడ్

పోయిన నెల ఒక యూట్యూబ్ ఛానెల్ లో ఒక ప్రొడ‌క్ష‌న్ హౌస్ కి చెందిన బంగ్లా అమ్మ‌కానికి ఉంది అనే యాడ్ క‌నిపించింది. అయితే ఏ ప్రొడ‌క్ష‌న్ హౌస్, బంగ్లా? ఎవ‌రిది? అనే వివ‌రాలు ఇవ్వ‌లేదు. కానీ, ఫొటోలు, వీడియోలు చూసిన ప్రతి ఒక్క‌రు అది కంగ‌నాదే అని గుర్తుప‌ట్టి కామెంట్లు పెట్టారు. మ‌ణిక‌ర్ణిక ప్రొడ‌క్ష‌న్ హౌస్ అది గుర్తు ప‌ట్టారు చాలా మంది. ఇక ఆ యాడ్ లో బంగ్లా ధ‌ర రూ. 40 కోట్లు అని ఉంది.

అక్ర‌మ క‌ట్ట‌డం అంటూ...

ప‌లీహిల్ లోని కంగ‌నా ఇంటిపై ఒక కంట్రవ‌ర్సీ ఉంది. అది ఒక అక్ర‌మ నిర్మాణం అని. బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ 2020లో కంగనా రనౌత్ ఇంటిని కొంత‌మేర కూల్చివేసి అక్ర‌మ నిర్మాణం అని నోటీసులు ఇచ్చారు. అయితే, ఆ ఆరోప‌ణ‌ల‌పై కంగ‌నా కోర్టుని ఆశ్ర‌యించింది. దీంతో కోర్టు స్టే ఇవ్వ‌గా... కూల్చివేతలు నిలిపి వేశారు. ఆ తర్వాత  ఆమె బీఎంసీపై రూ. 2 కోట్లకు ప‌రువు న‌ష్టం దావా వేసింది. కొన్ని రోజుల‌కు ఆ కేసును వాప‌స్ తీసుకుంది కంగ‌నా. 

'ఎమ‌ర్జెన్సీ' సినిమా కోసం? 

కంగ‌నా ర‌నౌత్ డైరెక్ష‌న్ చేసి, ఆమె ప్రొడ్యూస్ చేసిన 'ఎమ‌ర్జెన్సీ' సినిమా కోస‌మే ఆ బంగ్లాను అమ్మేసింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే... ఎమ‌ర్జెన్సీ సినిమా తెర‌కెక్కించి దాదాపు చాలా నెల‌లు గ‌డుస్తుంది. కానీ, ఇప్ప‌టికీ రిలీజ్ కాలేదు. కార‌ణం ఆమెకు సెన్సార్ సర్టిఫికెట్ రాక‌పోవ‌డం. ఆ సినిమాపై సిక్కుల సంఘం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. సినిమాలో త‌మ‌ను త‌ప్పుగా చూపించార‌ని, త‌మ‌ను కించ‌ప‌రిచార‌ని అందుకే రిలీజ్ చేయొద్ద‌ని, బ్యాన్ చేయాల‌ని కోరింది. ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 6న రిలీజ్ కావాల్సిన మ‌ళ్లీ వాయిదా పడింది. ఇటీవల సినిమాకి సెన్సార్  బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్నిసీన్ల‌ను తొల‌గించాలని, డిస్క్ల‌యిమ‌ర్లు యాడ్ చేయాల‌ని ఆదేశించింది. 

ఏంటీ సినిమా? 

ఇండియాలో గ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాల‌న‌తో ఎమ‌ర్జెన్సీ విధించిన విష‌యం తెలిసిందే. ఆ కాలంలో ప‌రిస్థితులు ఏంటి? అనేది చూపిస్తూ ఈ సినిమా తెర‌కెక్కించారు. ఆ సినిమాకి కంగ‌నా డైరెక్ట‌ర్ కాగా.. ఆమె ఇందిరా గాంధీ పాత్ర‌లో కూడా న‌టించారు.  ఇప్ప‌టికే ఆ సినిమాకి సంబంధించి ట్రైల‌ర్ రిలీజ్ కాగా.. దానిపై అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో సినిమాని బ్యాన్ చేయాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

Also Read: పెద్ద మ‌న‌సు చాటుకున్న తమిళ హీరో శింబు... తెలుగు రాష్ట్రాల వ‌ద‌ర బాధితుల‌కు సాయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget