అన్వేషించండి

Kajal Aggarwal: బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కాజల్... రష్మికతో పాటు చందమామ కూడా!

Kajal In Sikindar Movie: బాలీవుడ్ స్టార్ హీరోతో నటించే అవకాశం చందమామ కాజల్ అందుకున్నారని ముంబై టాక్. రష్మికతో పాటు ఆవిడ కూడా ఓ సినిమా చేస్తున్నారట.

హిందీ సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీకి క్వీన్ ఆఫ్ మాసెస్, తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) రెడీ అయ్యారని ముంబై టాక్. ఆవిడ హిందీ సినిమా చేసే ఆల్మోస్ట్ 8 ఏళ్లు అవుతోంది. సౌత్ సినిమాలు డబ్బింగ్ అయ్యి నార్త్ ఇండియాకు వెళ్లడం తప్ప... బాలీవుడ్ కంటే టాలీవుడ్, కోలీవుడ్ అవకాశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇప్పుడు కాజల్ ఓ హిందీ సినిమాకు సంతకం చేశారని, బాలీవుడ్ బడా హీరోతో నటించే అవకాశం అందుకున్నారని టాక్. 

సల్మాన్ ఖాన్ 'సికందర్'లో కాజల్ అగర్వాల్
Kajal Aggarwal in Salman Khan's Sikandar: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'సికందర్'. సౌత్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తీస్తున్న చిత్రమిది. ఇందులో కీలకమైన పాత్ర చేసే అవకాశం కాజల్ సొంతం చేసుకున్నారట. 

మురుగదాస్ దర్శకత్వం వహించిన దళపతి విజయ్ 'తుపాకీ'లో కాజల్ అగర్వాల్ నటించారు. అందులో ఆవిడ మెయిన్ హీరోయిన్. అయితే... ఈసారి మురుగదాస్ సినిమాలో కీ రోల్ చేసే అవకాశం వచ్చిందని బాలీవుడ్ జనాలు చెబుతున్నారు. అది నిజమైతే... సల్మాన్ ఖాన్, కాజల్ కాంబినేషన్ కుదరడం కూడా ఇదే తొలిసారి అవుతుంది. 

Also Read'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'

మెయిన్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా!
కాజల్ కీ రోల్ చేస్తే... మరి మెయిన్ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ సినిమా 'సికిందర్'లో అసలు హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఆవిడకూ సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ఇదే తొలి సినిమా. తమ సినిమాలో రష్మిక నటిస్తున్న విషయాన్ని 'సికందర్' టీమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. కానీ, కాజల్ విషయం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.

రంజాన్ కానుకగా థియేటర్లలోకి 'సికిందర్'
సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న 'సికిందర్' సినిమాను నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్ కానుకగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అసలు, ఈ సినిమా ప్రకటన రంజాన్ రోజు వచ్చింది.

Also Read: షాక్ ఇచ్చిన రష్మిక... నెల తర్వాత తీరిగ్గా యాక్సిడెంట్, రికవరీ గురించి రివీల్ చేసిందిగా

సల్మాన్ ప్రయాణంలో ప్రతి ఏడాది రంజాన్ పండక్కి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తన కొత్త సినిమాలను థియేటర్లలోకి తీసుకు రావడం ఆయనకు అలవాటు. ఒకవేళ సినిమా విడుదల చేయడం కుదరని పక్షంలో కొత్త సినిమా కబురు చెబుతారు. రంజాన్ పండక్కి వచ్చిన మెజారిటీ సినిమాలు విజయాలు సాధించాయి. వచ్చే ఏడాది 'సికిందర్' ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి. 'సికిందర్' సినిమా నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా (Sajid Nadiadwala)తో సల్మాన్ ఖాన్‌ది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాళ్లిద్దరి కలయికలో వచ్చిన 'జుడ్వా', 'ముజ్ సే షాదీ కరోగి', 'కిక్' బ్లాక్ బస్టర్స్ కొట్టాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Embed widget