Balakrishna : గిరిజనుల హక్కుల కోసం ఎన్‌బికె పోరాటం
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' సినిమా విజయ దశమికి విడుదల కానుంది. ఇందులో బాలకృష్ణ రోల్ ఏంటో తెలుసా?
ఎన్.బి.కె అంటే గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఆయన కొత్త సినిమా 'భగవంత్ కేసరి'లో హీరో పేరు కూడా ఎన్.బి.కె. అంటే నెలకొండ భగవంత్ కేసరి. మరి, బాలకృష్ణ రోల్ ఏమిటో తెలుసా?
సామాజిక కార్యకర్తగా బాలకృష్ణ!
Balakrishna Role In Bhagavanth Kesari Movie : 'భగవంత్ కేసరి' సినిమాలో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే సామాజిక కార్యకర్తగా బాలకృష్ణ క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తోంది. ఆయన కూడా గిరిజనులలో ఒకరిగా కనిపిస్తారట.
'భగవంత్ కేసరి'లో గిరిజనుల హక్కులు మాత్రమే కాదు... సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తావించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఓ లెక్క... ఇప్పుడీ 'భగవంత్ కేసరి'ది మరో లెక్క అనే విధంగా సినిమా ఉంటుందట!
ఇటీవల 'భగవంత్ కేసరి' మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివరలో 'బ్రో... ఐ డోంట్ కేర్' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. ''కలిసి మాట్లాడతా అన్నా కదా! అంతలోనే మందిని పంపాలా... గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే?!'' అంటూ అయన గూండాలను హెచ్చరించారు. ఎనిమిది నెలల్లో, 24 అద్భుతమైన ప్రదేశాలలో, 12 మాసివ్ సెట్లలో చిత్రీకరణ పూర్తి చేశారు.
Also Read : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా - బాలీవుడ్ హీరోయిన్
సాధారణంగా అనిల్ రావిపూడి అంటే కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రేక్షకులలో బలమైన ముద్ర పడింది. కామెడీ సినిమాలు మాత్రమే కాదు.... కంటెంట్ బేస్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కూడా ఆయన తీయగలరని చెప్పే విధంగా 'భగవంత్ కేసరి' ఉంటుందని యూనిట్ సన్నహిత వర్గాల నుంచి అందుకున్న సమాచారం.
విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ఆ రోజు మరో నాలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అయితే... బాలకృష్ణ సినిమా కోసం ప్రేక్షకులు కొంచెం ఎక్కువ ఎదురు చూస్తున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఫస్ట్ టైమ్... బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలిసి ఓ సినిమా చేయడం కారణం అయితే, డిఫరెంట్ కాన్సెప్ట్ కావడం మరొక కారణం. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్, 'గణేష్ యాంథమ్'కు మంచి రెస్పాన్స్ లభించింది.
Also Read : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?
షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ నిర్మాణ వ్యయంతో 'భగవంత్ కేసరి' చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటించారు. యువ కథానాయిక శ్రీ లీల ఓ ప్రధాన పాత్ర పోషించారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణ సోదరుడిగా ఆయన పాత్ర ఉంటుందని టాక్. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial