అన్వేషించండి

Akhanda 2 Postponed: సెప్టెంబర్ 25 నుంచి 'అఖండ 2' వాయిదా... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన టీమ్... 'ఓజీ'కి లైన్ క్లియర్

Akhanda 2 New Release Date: సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వస్తుందనుకున్న 'అఖండ 2' ఆ రోజు విడుదల కావడం లేదని, వాయిదా వేశామని నిర్మాతలు అఫీషియల్‌గా తెలిపారు.

Balakrishna's Akhanda 2 Release Pushed Back: 'అఖండ'కు సీక్వెల్‌గా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా 'అఖండ 2'. సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఈ సినిమా ఇప్పుడు ఆ తేదీకి రావడం లేదు. 'అఖండ 2' వెనక్కి వెళ్ళింది. విడుదల వాయిదా పడిన విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

'అఖండ 2' వాయిదాకు కారణం ఏమిటంటే?
Why Akhanda 2 Release Postponed?: 'అఖండ'కు ముందు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో 'సింహ', 'లెజెండ్' వచ్చాయి. ఆ రెండు చిత్రాలు మాస్ కమర్షియల్ సినిమాను కొత్త కోణంలో చూపించాయి. 'అఖండ' తెలుగు ప్రేక్షకులను దాటి ఉత్తరాది వరకు వెళ్ళింది. హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. అందుకే 'అఖండ 2' అనౌన్స్ చేసినప్పటి నుంచి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ నెలకొంది. అది హీరోతో పాటు దర్శక నిర్మాతలకు తెలుసు. అందుకే, ఆడియన్స్‌కు ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. 

నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' డబ్బింగ్ ఫినిష్ చేశారు. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడం కోసం రీ రికార్డింగ్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. వీఎఫ్ఎక్స్ మీద దృష్టి సారించారు. అవి కంప్లీట్ చేయడానికి మరింత టైమ్ అవసరం అవుతుందని, చిత్ర బృందం క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నారని, సినిమా విడుదలకు టైం కావాలి కనుక వాయిదా వేశామని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పేర్కొంది.

Also Read'ఘాటీ' సెన్సార్ రివ్యూ... అనుష్క సినిమా టాకేంటి? దర్శకుడు క్రిష్ కమ్‌బ్యాక్‌ ఇస్తాడా?

పవన్ కళ్యాణ్ 'ఓజీ'కి లైన్ క్లియర్!పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదల కానుంది. 'అఖండ 2' విడుదల వాయిదా పడటంతో ఆ మూవీకి లైన్ క్లియర్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ బరిలో 'ఓజీ'లో సోలో రిలీజ్ దక్కుతుంది. 

డిసెంబర్ / జనవరి... రిలీజ్ ఎప్పుడు?
సెప్టెంబర్ 25న 'అఖండ 2' విడుదల అయ్యే అవకాశం లేదని కొన్ని రోజుల నుంచి ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతోంది. ఇప్పుడు 'అఖండ 2' వెనక్కి వెళ్ళింది. కొన్ని రోజుల క్రితం వరకు డిసెంబర్ తొలి వారంలో లేదా సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని వినిపించాయి. కానీ, జనవరి 9, 2026 - సంక్రాంతికి రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' వెళ్లడంతో డిసెంబర్ ఫస్ట్ వీక్ స్లాట్ ఖాళీ అయ్యింది. సో, జనవరిలో కాకుండా డిసెంబర్ తొలి వారంలో 'అఖండ 2' విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. మరి, చిత్ర బృందం ఎప్పుడు విడుదల చేస్తుందో? ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్. ఆది పినిశెట్టి విలన్.

Also Readసుందరకాండ కలెక్షన్లు... నారా రోహిత్ సినిమా హిట్టే... మరి బాక్సాఫీస్ సంగతేంటి? ఫస్ట్ డే ఎంత వసూళ్ళు వచ్చాయంటే?

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Naga Chaitanya Sobhita Dhulipala : చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ
చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget