Ghaati Censor Review: 'ఘాటీ' సెన్సార్ రివ్యూ... అనుష్క సినిమా టాకేంటి? దర్శకుడు క్రిష్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
Ghaati Censor Report: క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన 'ఘాటి' సెన్సార్ కంప్లీట్ అయ్యింది. మరి టాక్ ఎలా ఉందనేది తెలుసుకోండి.

క్వీన్ అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ జాగర్లమూడిది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన సినిమా 'వేదం'. ఆ మూవీలో అనుష్క వేశ్య పాత్రలో నటించారు. ఎటువంటి వల్గారిటీ లేకుండా ఆ పాత్రను క్రిష్ మలిచిన తీరు ప్రశంసలు అందుకుంది. 'ఘాటీ'తో సెప్టెంబర్ 5న అనుష్క, క్రిష్ థియేటర్లలోకి రానున్నారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. మరి టాక్ ఏంటో తెలుసుకోండి.
ఇంటర్వెల్ తర్వాతే అసలైన యాక్షన్!
'ఘాటీ'కి సెన్సార్ బోర్డు ఉబయే సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైం కూడా తక్కువే రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు. ఈ మూవీ చూసిన సెన్సార్ సభ్యులు మంచి హిట్ అవుతుందని చిత్ర దర్శక నిర్మాతలకు కాంప్లిమెంట్స్ ఇచ్చారట.
'ఘాటీ' ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో ఆసక్తి కలిగించడానికి ముఖ్యమైన కారణం... బస్సులో ఒక వ్యక్తి పీకను అనుష్కకు కోసే సన్నివేశం! ఆ రీతిలో ఆమెను ఇప్పటివరకు వయలెంట్ పాత్రలో ఎవరూ చూపించలేదు. అనుష్క యాక్షన్ సినిమాలు చేశారు కానీ ఈ తరహా పవర్ఫుల్ రోల్ ఇప్పటివరకు చేయలేదు. దాంతో అందరిలో ఆసక్తి మొదలైంది. అయితే ఆ యాక్షన్ కోసం సెకండ్ హాఫ్ వరకు వెయిట్ చేయాలనేది సెన్సార్ టాక్.
ఇంటర్వెల్ ముందు వరకు ఎమోషనల్ జర్నీని దర్శకుడు క్రిష్ ఎక్కువ చూపించారట. అనుష్కతో పాటు మిగతా పాత్రలను పరిచయం చేయడం, వాళ్ల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించడం, కొండ ప్రాంతాలలో ప్రజల జీవన శైలిని చూపించడం వంటిది చేశారని తెలిసింది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అందరికీ షాక్ ఇస్తుందని తెలిసింది. అక్కడి నుంచి సినిమా స్వరూపమే మారిందట. ఒక్కసారి యాక్షన్ మోడ్ తీసుకుని థియేటర్లలో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఇన్సైడ్ టాక్. గంజాయి నేపథ్యంలో సీన్స్ కూడా ఉన్నాయట.
అనుష్కతో పాటు దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి కూడా ఘాటీ సినిమా చక్కటి కమ్ బ్యాక్ అవుతుందని సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. తెలుగుతో పాటు పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది సినిమా. ఇందులో అనుష్క జంటగా విక్రమ్ ప్రభు నటించారు. ఇటీవల మయసభ వెబ్ సిరీస్ ద్వారా పేరు తెచ్చుకున్న చైతన్య రావు విలన్ రోల్ చేశారు. ఈ సినిమాను యు వి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద రాజీవ్ రెడ్డి సాయిబాబా జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ ఐదున మరో పెద్ద సినిమా రిలీజ్ ఏదీ లేదు. అనుష్కకు సోలో రిలీజ్ దక్కినట్లే. ఆడియన్స్ నుంచి హిట్ టాక్ వస్తే సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
Also Read: మహేష్ అన్న కుమారుడికి మోహన్ బాబు విలన్... కొత్త కుర్రాడి సినిమాలో హీరోను మించిన క్యారెక్టర్?





















