Sundarakanda Box Office Collection Day 1: సుందరకాండ కలెక్షన్లు... నారా రోహిత్ సినిమా హిట్టే... మరి బాక్సాఫీస్ సంగతేంటి? ఫస్ట్ డే ఎంత వచ్చాయంటే?
Sundarakanda Collections: నారా రోహిత్ సోలో హీరోగా నటించిన 'సుందరకాండ'కు పాజిటివ్ టాక్ వచ్చింది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ సంగతి ఏంటి? థియేటర్స్ నుంచి ఎంత రాబట్టింది? అనేది తెలుసుకోండి.

నారా రోహిత్ నటనకు చాలామంది అభిమానులు ఉన్నారు. అతనికి మంచి టాలెంట్ ఉన్నప్పటికీ సరైన విజయాలు దక్కడం లేదని ప్రేక్షకులలో ఉన్న అభిప్రాయం. ఆల్మోస్ట్ ఐదేళ్ల విరమణ తర్వాత గత ఏడాది 'ప్రతినిధి 2'తో రీ ఎంట్రీ ఇచ్చారు. మల్టీస్టారర్ భైరవం చేశారు. ఆ రెండు సినిమాలకు యునానిమస్ హిట్ టాక్ రాలేదు. సోలో హీరోగా చేసిన తాజా సినిమా 'సుందరకాండ'కు వచ్చింది. హిట్ టాక్ పక్కన పెడితే కలెక్షన్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...
మొదటిరోజు కోటి కూడా రాలేదు!
వినాయక చవితి పండుగ సందర్భంగా ఆగస్టు 27న 'సుందరకాండ' థియేటర్లలోకి వచ్చింది అయితే ముందు రోజు... ఆగస్టు 26వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలు వేశారు. హైదరాబాద్ సిటీలో చూసిన ఆడియన్స్ మాత్రమే కాదు అమెరికాలో చూసిన ఎన్నారైలు సైతం మంచి ఫన్ ఫిలిం అని పేర్కొన్నారు. అయితే థియేటర్లకు ఆడియన్స్ రాక మాత్రం తక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో 'సుందరకాండ' ఫస్ట్ డే కలెక్షన్లు 60 లక్షలు మాత్రమే. ఇండియాలో ఈ సినిమా మొదటి రోజు 54 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ రాబట్టింది. బ్రాస్ చూస్తే 61 లక్షలు అని లెక్క తేలింది. అమెరికాలో సినిమాకు ఏమంత గొప్ప స్పందన రాలేదు. సుమారు 8 డాలర్లు వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీలో చూస్తే అక్కడ నుంచి 7 లక్షల రూపాయలు వచ్చింది.
హిట్ టాక్ వచ్చిన కలెక్షన్లు రాలేదు!
సుందరకాండ సినిమాకు మొదటి రోజు మంచి హిట్ టాక్ వచ్చినా సరే కలెక్షన్లు మాత్రం రాలేదు. పండగ హడావిడిలో పూజల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రాలేదనుకుంటే... ఇవాల్టి నుంచి అయినా కలెక్షన్లు పెరగాల్సిన అవసరం ఉంది.
Also Read: మహేష్ అన్న కుమారుడికి మోహన్ బాబు విలన్... కొత్త కుర్రాడి సినిమాలో హీరోను మించిన క్యారెక్టర్?
సినిమా విడుదలకు ముందు ఒక ఇంటర్వ్యూలో వార్ 2 కాకుండా తన స్నేహితులు కూలి టికెట్స్ బుక్ చేశారని నారా రోహిత్ చెప్పడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, సినిమా చూసి రాయమని నారా రోహిత్ రిక్వెస్ట్ చేశారు. ఒకవేళ సినిమా నచ్చకపోయినా సరే ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవిస్తానని చెప్పారు. ఆ నెగెటివిటీ ఏమి ఎఫెక్ట్ చూపించలేదని చెప్పాలి. సినిమాకు రివ్యూలతో పాటు సోషల్ మీడియా రివ్యూలు కూడా బాగున్నాయి. మరి కలెక్షన్లు ఎందుకు రాలేదో?
Also Read: రకుల్ ఇంట వినాయక చవితి పూజలు... ప్రగ్యా, మృణాల్ సందడి... ఫోటోలు చూశారా?





















