Baby OTT release: ‘బేబీ’ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, కష్టమే!
సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ బాక్సాఫీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. థియేటర్లలో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు మరింత సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది.
Baby OTT Release: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన లేటెస్ట్ చిత్రం 'బేబీ' జూలై 14, 2023న విడుదలైన విషయం తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దాదాపు రూ.10కోట్ల బడ్జెట్ తో తెరెకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.60కోట్లకు పైగానే కలెక్షన్లు వసూలు చేసింది. సినిమా రిలీజైన రోజు నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్న బేబీ.. ఇటీవలే రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఇప్పటికీ అన్ని చోట్లా థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తోంది. బేబీ ఘన విజయం సాధించడంతో మేకర్స్ ఓటీటీ (OTT) విడుదల తేదీని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 11 లేదా 18న ‘ఆహా’ ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మాస్ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ తో పాటు నాగబాబు, సాత్విక్ ఆనంద్, కుసుమ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చారు. ఇక ఇప్పటికే బాక్సాఫీస్ భారీ విజయంతో పాటు.. మంచి వసూళ్లను కలెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నటించిన ముగ్గురు కీలక పాత్రలు అందుకున్న రెమ్యునరేషన్ పైనా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో హీరోగా చేసిన ఆనంద్ దేవరకొండకు రూ.80 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చారని, హీరోయిన్‌గా చేసిన వైష్ణవికి రూ.30 లక్షలు.. సెకండ్ హీరోగా చేసిన విరాజ్‌కు రూ.20 లక్షలు ఇచ్చారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. నెటిజన్స్ మాత్రం అంత హిట్ సినిమాకు ఇంత తక్కువ రెమ్యూనరేషన్ ఏంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో దర్శక నిర్మాతలు మరికొంత రెమ్యూనరేషన్ ఇచ్చే ఆస్కారం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.
చిన్న సినిమాగా వచ్చిన 'బేబీ'.. బాక్సాఫీస్ దగ్గర మంచి రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టే ఆస్కారం ఉంది. 'బేబీ' విడుదలకు ముందే సాలిడ్ బజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ డేనే అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. స్కూల్ లో చిగురించిన ప్రేమ, ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ.. కాలేజీకి వెళ్లాక ఎలా మారుతుందనే సన్నివేశాలతో సినిమాను చూపించడం అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలోను అదరగొడుతోంది. ముఖ్యంగా ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవడంతో రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను చూసిన అల్లు అర్జున్, రవితేజ, సుకుమార్ వంటి పలువురు సినీ ప్రముఖులు బేబీ టీమ్‌ను అభినందింస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటనకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.
Read Also : Devi Sri Prasad - Kanguva : డీఎస్పీ గట్టిగా కొట్టాడుగా - ఒక్క దెబ్బకు మళ్ళీ లెక్కలు సెట్ అంతే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial