Devi Sri Prasad - Kanguva : డీఎస్పీ గట్టిగా కొట్టాడుగా - ఒక్క దెబ్బకు మళ్ళీ లెక్కలు సెట్ అంతే!
ఒక్క టీజర్... టీజర్ నేపథ్య సంగీతంతో దేవిశ్రీ ప్రసాద్ గట్టిగా కొట్టాడు. పాన్ ఇండియా లెక్కలు మొత్తం సెట్ చేశాడంతే! 'కంగువా' టీజర్ అంత హైప్ క్రియేట్ చేసిందంటే డీఎస్పీ మ్యూజిక్ కూడా ఒక రీజన్!
దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అంటే ఛార్ట్ బస్టర్! మినిమమ్‌లో మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. మాస్ పల్స్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అయితే... ఆయన సంగీతం మీద డీఎస్పీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం ఆ మధ్య అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ అంతగా పాపులర్ కాలేదు. దేవిశ్రీ స్పెషల్ సాంగ్స్ సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటాయ్! 'ఎఫ్ 3'లో పూజా హెగ్డే చేసిన సాంగ్ చాలా మందికి నచ్చలేదు.
దేవి శ్రీ ప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాదు... హిందీ సినిమాలకు కూడా మ్యూజిక్ అందించారు. అయితే... పాన్ ఇండియా సినిమాల హోరు, జోరు పెరిగిన తరుణంలో ఆయన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేశారు. మరోవైపు ఇతర సంగీత దర్శకులు ప్రయోగాలు చేస్తుంటే... దేవి శ్రీ ప్రసాద్ తనను తాను ఒక సెక్షన్ ఆఫ్ సినిమాలకు మాత్రమే పరిమితం చేసుకుంటున్నారా? అని అభిమానులు కాస్త ఫీలైన మాట వాస్తవం.
'పుష్ప : ద రైజ్'లో ఐటమ్ సాంగ్ 'ఊ కొడతావా మావ ఊఊ కొడతావా' భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాన్ వరల్డ్ రేంజులో ఆ పాట పబ్బుల్లో మార్మోగింది. ఆ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. కానీ... 'బాహుబలి', 'కెజియఫ్', 'కాంతార' తరహా సినిమాలు దేవి శ్రీ ప్రసాద్ ఖాతాలో లేవు. 'దేవి' వంటి ఫాంటసీ సినిమాతో డీఎస్పీ కెరీర్ స్టార్ట్ చేశారు. కానీ, 'బాహుబలి' వంటి సినిమాలు ఆయన ఖాతాలో లేవు. ఆ లోటు 'కంగువా'తో తీర్చేలా ఉన్నారు దేవి శ్రీ ప్రసాద్.
వరుణ్ తేజ్ 'తొలిప్రేమ'తో తమన్ వైవిధ్యం చూపించారు. ఇక, 'అఖండ' నేపథ్య సంగీతం ఆయనకు మరింత పేరు తెచ్చింది. దేవి శ్రీ జోరు తగ్గిన సమయంలో 'విక్రమ్'తో పాటు ఇతర తమిళ సినిమా విజయాలతో అనిరుద్ పేరు ఎక్కువ వినిపించింది. ఆయన్ను తెలుగు సినిమాలకూ తీసుకొచ్చారు. ఒకప్పుడు ప్రేమకథలు అంటే దేవి శ్రీ ప్రసాద్ పేరు వినపడేది. ఇటీవల 'ఖుషి'తో పాటు మరికొన్ని ప్రేమకథా చిత్రాలకు మలయాళం నుంచి హేషామ్ అబ్దుల్ వాహాబ్, తమిళం నుంచి జీవీ ప్రకాష్ కుమార్ వంటి సంగీత దర్శకులను తీసుకొచ్చారు. తెలుగు నాట యువ సంగీత దర్శకుల జోరు కూడా పెరిగింది. రేసులో దేవి శ్రీ వెనుక పడ్డారని కొన్ని కామెంట్స్ కూడా వినిపించాయి. ఒక్క దెబ్బతో అనుమానాలను పటాపంచలు చేశారు దేవిశ్రీ. జూలు విదిల్చిన సింహంలా 'కంగువా' వీడియోకి బీభత్సమైన నేపథ్య సంగీతం అందించారు.
ఒక్క దెబ్బతో లెక్కలు తేల్చిన డీఎస్పీ!
తమిళ కథానాయకుడు సూర్య, దర్శకుడు శివ కలయికలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ 'కంగువా' (Kanguva Movie). పది భాషల్లో, త్రీడీలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హీరో బర్త్ డే సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. దానికి దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్. టీజర్ విడుదల తర్వాత సినిమాకు అంత హైప్ క్రియేట్ అయ్యిందంటే... డీఎస్పీ రీ రికార్డింగ్ ఒక రీజన్. ఆయన సౌండింగ్‌లో కొత్తదనం వినిపించింది. గూస్ బంప్స్ తెప్పించారు.
Also Read : పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాకు ఆడిషన్స్ ఇచ్చా - 'సామజవరగమన' ఫేమ్ రెబా మోనికా జాన్
'కంగువా' టీజర్ చూస్తే... ఒక్క దెబ్బతో దేవి శ్రీ ప్రసాద్ పాన్ ఇండియా లెక్కలు అన్నీ సెట్ చేసేలా ఉన్నారు. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఆయన సంగీతంలో డిఫరెన్స్ కనిపించింది.
తెలుగులో దేవి శ్రీ ఎందుకు పాడలేదో?
దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు మాత్రమే కాదు... గాయకుడు కూడా! సినిమాల్లో కొన్ని పాటలు పాడతారు కూడా! ముఖ్యంగా టైటిల్ సాంగ్స్ పాడటంతో డీఎస్పీది సపరేట్ స్టైల్. 'కంగు... కంగు... కంగువా' అంటూ వీడియో గ్లింప్స్ (Kanguva Glimpse)లో టైటిల్ పడినప్పుడు దేవి శ్రీ ప్రసాద్ వాయిస్ వినిపించింది. ఒక్క తెలుగు గ్లింప్స్‌లో మాత్రం ఆయన వాయిస్ లేదు. హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం ఆయన వాయిస్ వినపడింది. తెలుగులో ఎందుకు డీఎస్పీ వాయిస్ ఎందుకు లేదో!?
Also Read : అసలు సిసలైన పాన్ ఇండియా కాస్ట్ - మోహన్ లాల్ 'వృషభ' షూటింగ్ మొదలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial